హోటల్ లాబీలో మూత్ర విసర్జన చేసిన ఓ సేల్స్‌మెన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. సేల్స్ మాన్ తన సమస్యను వివరించినా వినలేదు. దాంతో సదరు ఉద్యోగి ఆ హోటల్ నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. అంతే కాదు ఆ కంపెనీపై కేసు కూడా పెట్టి పోరాడుతున్నాడు. తనకు జరిగింది అన్యాయం అంటూ కోర్టులో దావా వేశారు. ఈ సూట్‌లో తనను తప్పుగా భావించి ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపాడు.. ఇప్పుడు అతను కంపెనీ నుండి కనీసం 1.5 మిలియన్ డాలర్లు అంటే,12 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సదరు ఉద్యోగి వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
న్యూయార్క్‌కు చెందిన 66 ఏళ్ల రిచర్డ్ బేకర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. రిచర్డ్ బేకర్ టైమ్స్ స్క్వేర్ హోటల్‌లో మూత్ర విసర్జన చేశాడని అతని సహోద్యోగి ఒకరు సాక్షిగా ఆరోపించారు. అతను ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో హోటల్ లాబీలో మూత్ర విసర్జన చేస్తున్నాడని భావించి, అతనిపై HRకి ఫిర్యాదు చేశారు. కాగా, రిచర్డ్ మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాననే విషయాన్ని కంపెనీ యజమాన్యానికి వివరించుకున్నాడు. గత ఏనిమిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఈ క్రమంలోనే హోటల్ లోపలకు వస్తున్న క్రమంలోనే తనకు సమస్య ఎదురైందని చెప్పాడు. టాయిలెట్ వరకు వెళ్లలేక లాబీకి ఆనుకుని ఉన్న వరండాలో మూత్ర విసర్జన చేసినట్టుగా అంగీకరించాడు.
ఈ పోస్ట్ పై క్లిక్ చేయండి..
A Lenovo computer salesman was fired from his job after he urinated in a lobby of Times Square hotel.
Richard Becker, 66, is seeking at least $1.5 million from Lenovo after being dismissed for the wrongful wee. pic.twitter.com/l0mWLURlLg
— The NewsWale (@TheNewswale) August 26, 2024
తాను 2016 నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పారు. దానికి చికిత్స కూడా జరుగుతోందన్నాడు. ఈ విషయాన్ని గతంలోనే కంపెనీకి సంబంధించిన వ్యక్తులకు తెలిసినా, తనపై సానుభూతి చూపకుండా కంపెనీ నుంచి తొలగించారని బాధితుడు వాపోయాడు. ఇప్పుడు రిచర్డ్ మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కంపెనీపై కేసు పెట్టారు. అలాగే సుమారు రూ.12 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిపై ఆ వ్యక్తి పనిచేస్తున్న ప్రముఖ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ కంపెనీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..