కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

ఇదిలా ఉంటే, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు భారత నౌకాదళం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నేవీ నుంచి విచారణతోపాటు విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఎలా పడిపోయిందో తెలుసుకోవడానికి ఒక కమిటీని నియమించారు.

కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

|

Updated on: Aug 27, 2024 | 1:34 PM

మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్ లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ విగ్రహం కుప్పకూలింది. గత ఏడాది డిసెంబర్ 4న నేవీడే సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోడానికి సరైన కారణం తెలియకపోయినా, గత రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు , ఈదురు గాలులే కారణం కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ఈ విగ్రహ నిర్మాణంలో లోపాలున్నాయని, పనుల్లో నాణ్యత లేనందునే విగ్రహం కుప్పకూలిందని విపక్షాలు ఆరోపించాయి.

ఇదిలా ఉంటే, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు భారత నౌకాదళం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నేవీ నుంచి విచారణతోపాటు విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఎలా పడిపోయిందో తెలుసుకోవడానికి ఒక కమిటీని నియమించారు. త్వరితగతిన మరమ్మత్తు పనులు చేపట్టి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపించాలన్నారు.

Follow us