Viral Video: ఈ ఏనుగు మహా చిలిపి గురూ.. టూరిస్టులతో ఓ ఆట ఆడుకుందిగా.. ఫన్నీ వీడియో వైరల్

కొన్నిసార్లు జంతువులు పర్యాటకుల వాహనాలపైకి ఎక్కడం లేదా వాహనాలోపలి చేరుకొని పర్యాటకులతో ఎంజాయ్ చెయ్యడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో పర్యాటకులు భయాందోళనకు గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రజలు మొదట ఆశ్చర్యపోయారు.. తరువాత నవ్వడం ప్రారంభించారు. వీడియోలో ఒక ఏనుగు పర్యాటకులతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. రకరకాల చిలిపి పనులు చేస్తూ సందడి చేయడం కనిపిస్తోంది.

Viral Video: ఈ ఏనుగు మహా చిలిపి గురూ.. టూరిస్టులతో ఓ ఆట ఆడుకుందిగా.. ఫన్నీ వీడియో వైరల్
Elephant Video Viral

Updated on: Jan 23, 2024 | 1:20 PM

ప్రస్తుతం జంగిల్ సఫారీ టూర్ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులలో పర్యటించడాన్ని ప్రకృతి ప్రేమికులు బాగా ఆనందిస్తున్నారు. ప్రజలు జంతుప్రదర్శనశాలల్లో లేదా కొన్ని రకాల జంతువులను సర్కస్ వంటి ప్రాంతాల్లో చూసినప్పటికి.. వాటిని బహిరంగగా అంటే అడవులలో ప్రకృతికి దగ్గరగా చూడటం ఓ వింతైన అనుభవాన్ని ఇస్తుంది. అంతేకాదు అవి ఆహారం కోసం చేసే పోరాటం  ప్రజలను పులకింపజేస్తుంది. అయితే.. కొన్నిసార్లు జంతువులు పర్యాటకుల వాహనాలపైకి ఎక్కడం లేదా వాహనాలోపలి చేరుకొని పర్యాటకులతో ఎంజాయ్ చెయ్యడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో పర్యాటకులు భయాందోళనకు గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రజలు మొదట ఆశ్చర్యపోయారు.. తరువాత నవ్వడం ప్రారంభించారు.

వీడియోలో ఒక ఏనుగు పర్యాటకులతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. రకరకాల చిలిపి పనులు చేస్తూ సందడి చేయడం కనిపిస్తోంది. ఓ టూరిస్ట్ వాహనం అడవిలో వెళ్తోంది. వాహనం మీద నుంచి కొంతమంది యువతీ యువకుల తమ సమీపంలోని ఏనుగులపై చూస్తున్నారు. అయితే అలా వాహనం ప్రయాణిస్తున్న సమయంలో ఓ ఏనుగు వేగంగా వచ్చేసింది. ఏనుగుల వైపు చూస్తున్న పర్యాటకులు కంగారు పడ్డారు.. పట్టుకోల్పోయిన ఓ యువతి భయంతో కారు మీద నుంచి కిందకు దూకేసింది. అయితే వాహనం దగ్గరకు వేగంగా వచ్చిన ఏనుగు మళ్ళీ ఒక్కసారిగా ఆగి వెనక్కు వెళ్ళింది. తొండాన్ని ఊపుతూ ఎంజాయ్ చేసింది. అప్పుడు టూరిస్టులు ఊపిరి పీల్చుకున్నారు. కిందకు దూకిన అమ్మాయి కూడా తిరిగి కారు పైకి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @AMAZlNGNATURE పేరుతో IDతో భాగస్వామ్యం చేయబడింది.’ఇది చిలిపి ఏనుగు స్నేహితులారా’ అనే క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 7 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 కోటి కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. 97 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒక వినియోగదారు హాస్యభరితంగా..  ‘ఏనుగు నవ్వుతున్నట్లు కనిపిస్తోంది’ అని రాశారు, మరొకరు ‘ఏనుగులు తెలివైన,  సున్నితమైన జీవులు, కాబట్టి మనం ఎల్లప్పుడూ వాటిని ప్రేమగా, దయతో చూడాలని కోరారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..