Viral Video: వీడియో తీయమని ఫోన్ ఇస్తే.. ఈ ఏనుగు ఏం చేసిందో చూశారా ? తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..

|

Sep 08, 2021 | 12:00 PM

ప్రపంచంలోనే అతి పెద్ద జంతువు ఏనుగు. కానీ చిన్న చీమకు కూడా భయపడుతుంది. ఏనుగులు చేసే చిన్న అల్లరి పనులు చూస్తుంటే ముచ్చటేస్తుంది.

Viral Video: వీడియో తీయమని ఫోన్ ఇస్తే.. ఈ ఏనుగు ఏం చేసిందో చూశారా ? తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..
Viral Video
Follow us on

ప్రపంచంలోనే అతి పెద్ద జంతువు ఏనుగు. కానీ చిన్న చీమకు కూడా భయపడుతుంది. ఏనుగులు చేసే చిన్న అల్లరి పనులు చూస్తుంటే ముచ్చటేస్తుంది. మనం చేసే పొరపాట్లతో వాటి ఆగ్రహానికి కారణమైన.. ఏనుగులు కూడా మనుషలతో స్నేహంగానే ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాల ఏనుగులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఎన్నో ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. ఏనుగుల అల్లరి చేష్టలను.. గున్న ఏనుగుల మారాం వీడియోలు చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు… ఏనుగుల ఫన్నీ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటివి చూస్తే చిన్న వారి నుంచి పెద్దవారి వరకు చిరునవ్వులు చిందించాల్సిందే. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో కాస్త విభిన్నం.. ఆ ఏనుగు చేసిన పని నవ్వులు పూయిస్తుంది.

ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయి, అబ్బాయి.. తమను వీడియో తీయమని తమతో ఉన్న పెద్ద ఏనుగుకు చెప్పి.. ఫోన్ తన తొండంకు ఇచ్చారు. అనంతరం వీడియోకు అనుగుణంగా ఫోటో ఫోజులిస్తూ వీడియోలకు ఫోజిచ్చారు. అంతేకాదు.. అమ్మాయిని అబ్బయి ఎత్తుకుని తిప్పేసమయంలో ఆ ఏనుగు కూడా చలాకిగా ఫోన్‏ను కూడా రౌండ్ గా తిప్పెసింది. ఇక వీడియో తీయడం పూర్తయ్యక..దానిని చూసి స్టన్ అయ్యారు ఆ ఇద్దరు. తమను వీడియో తీయాల్సింది పోయి.. ఆ ఏనుగు తనకు తానే సెల్ఫీ వీడియో తీసుకుంది. అందులో ఏనుగు ఫేస్ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియో తీయడానికి బదులుగా ఏనుగు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు చూసేయ్యండి.

Also Read: Tollywood Drugs Case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రానా.. కొనసాగుతున్న విచారణ.. వీడియో

Akshay Kumar: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం.. అక్షయ్ కుమార్ తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్ చేసిన నటుడు..