AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నదిలోకి పిల్ల ఏనుగుతో కలిసి ఆటలాడిన గజరాజులు.. వీడియో వైరల్..

సాధారణంగా ఏనుగులు కాలువల్లో.. బురదల్లో గంతులేసే వీడియోలు చూస్తునే ఉంటాం. అయితే హద్దులేని అల్లరి చేస్తూ ఒక్కొసారి పిల్ల ఏనుగులు ప్రమాదంలో కూడా పడుతుంటాయి.

Viral Video: నదిలోకి పిల్ల ఏనుగుతో కలిసి ఆటలాడిన గజరాజులు.. వీడియో వైరల్..
Elephant Video
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 19, 2021 | 1:47 PM

Share

సాధారణంగా ఏనుగులు కాలువల్లో.. బురదల్లో గంతులేసే వీడియోలు చూస్తునే ఉంటాం. అయితే హద్దులేని అల్లరి చేస్తూ ఒక్కొసారి పిల్ల ఏనుగులు ప్రమాదంలో కూడా పడుతుంటాయి. అందుకే పిల్ల ఏనుగులు చేసే ప్రతిపనిని తల్లి ఏనుగులు ఓ కంట కనిపెడుతూ..ప్రతిక్షణం వాటికి రక్షణ కల్పిస్తూ తల్లిప్రేమను చాటుకుంటాయి. ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అందులో ఓ పిల్ల ఏనుగు తన తల్లిదండ్రులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లింది. వెంటనే అక్కడున్న నీటిలోకి దూకి ఆడాలనుకుంది. వెంటనే అందులోకి దూకింది.. కానీ.. ఒడ్డున ఉన్న తల్లి ఏనుగు మాత్రం నదిలోకి ముందుగా వెళ్లాడానికి ఇష్టపడలేదు. మొదట తల్లి ఏనుగు, దానితో పాటున్న మరో ఏనుగు నదిలోకి దిగి ఆ పిల్ల ఏనుగు ఆడుకునేందుకు ఆ ప్రాంతం సేఫ్‌గా ఉందా లేదా అని పరిశీలించాయి. ఆ తర్వాత ఏనుగు పిల్లను నీటి లోపలికి తీసుకెళ్లి ఆటాడించాయి. ఈ వీడియో గతంలో కూడా చాలా ట్రెండ్ అయ్యింది. మరోసారి ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రమెన్ తన ట్విట్టర్ ఖాతాలో చేశారు. “తల్లి ఏనుగులు ఎప్పుడు తమ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటాయి. వారి చుట్టు ఉన్న వాతావరణం సురక్షితంగా ఉందని నమ్మితేనే పిల్ల ఏనుగులను ఒంటరిగా ఆడుకోనిస్తాయి. ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోకి కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

ట్వీట్..

Also Read: New Labour Act : త్వరలో వారానికి 3 రోజులు సెలవు..! కేవలం 4 రోజులు మాత్రమే పని.. కొత్త లేబర్ చట్టం ఏం చెబుతుంది..?

Fennel Water : రక్తపోటు.. క్యాన్సర్ సమస్యలను తగ్గించే సోంపు నీరు.. బరువు తగ్గాలనుకునేవారికి సూపర్ పుడ్..