Electric Scooter : బాబోయ్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. చూస్తుండగానే తగలబడిపోయింది

డెలివరీ బాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాదానికి గురైంది. తొలుత బ్యాటరీ కంపార్ట్‌మెంట్ నుండి పొగలు రావడం కనిపించింది. ఆ తరువాత స్కూటర్ మంటలు అంటుకుని పేలిపోయింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Electric Scooter : బాబోయ్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. చూస్తుండగానే తగలబడిపోయింది
Electric Scooter Bursts

Updated on: Feb 12, 2025 | 11:53 AM

గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల భద్రత పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి రోజూ ఏదో ఒకచోట ఈ స్కూటర్లు పేలిన ఘటనలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే గ్రేటర్ నోయిడాలో తీవ్ర కలకలం రేపింది. ఒక డెలివరీ బాయ్ బైక్‌ ఆర్డర్ పూర్తి చేయడానికి వెళుతుండగా అతని ఇ-స్కూటర్ ఊహించని విధంగా మంటల్లో చిక్కుకోవడంతో ఆందోళన మరింత తీవ్రమైంది.

గ్రేటర్ నోయిడా గార్ సిటీ సెవెన్త్ అవెన్యూ సొసైటీలో డెలివరీ బాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాదానికి గురైంది. తొలుత బ్యాటరీ కంపార్ట్‌మెంట్ నుండి పొగలు రావడం కనిపించింది. ఆ తరువాత స్కూటర్ మంటలు అంటుకుని పేలిపోయింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో బ్యాటరీ కంపార్ట్‌మెంట్ నుండి పొగలు కనిపించింది. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగడం గమనించిన డెలీవరి బాయ్‌ వెంటనే ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..