ప్రపంచంలో అనేక రకాల జంతువులు నివసిస్తుంటాయి. అయితే వాటిల్లో కొన్నింటికి మాత్రమే తమను తాము కాపాడుకునే శక్తి ఉంటుంది. అందులో ఒకటి ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్. దీనికున్న అతిపెద్ద లక్షణం ఏంటంటే.. ఇది హైవోల్టేజ్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎవరైనా కూడా దీన్ని వేటాడడానికి వస్తే.. ఆ ప్రెడేటర్లకు హైవోల్టేజ్ కరెంట్ షాక్ తగలడం ఖాయం. అంత రేంజ్‌లో షాక్ తగిలితే.. చావడం ఖాయం అని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఈల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. నది ఒడ్డున ఉన్న ఓ మొసలి.. పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ ఈల్ చేపను వేటాడటానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. సరైన సమయం కోసం ఎదురు చూసి తన పదునైన దవడలతో ఈల్ చేపను పట్టుకుంటుంది మొసలి. అంతే.! ఇక్కడ మొసలి ఒకటి అనుకుంటే.. మరొకటి అయింది.. ఈల్ చేప హైవోల్టేజ్ కరెంట్‌ను రిలీజ్ చేయడంతో.. మొసలి అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. అటు మొసలి దెబ్బకు ఈల్ ఫిష్ కూడా కొద్దిసేపు ప్రాణాలతో పోరాడి మరణించింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
An unlucky alligator had his last meal when he decided to bite into an electric eel.
Electric Eels can deliver up to 860 volts of electricity, enough to deter most animals.
This Alligator was unable to release it due to shock. Eventually killing the eel & itself in the process. pic.twitter.com/0d7QbNLS5O
— Dipanshu Kabra (@ipskabra) April 3, 2022
కాగా, ఈ వీడియోను IPS అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ఎలక్ట్రిక్ ఈల్‌ను తన మీల్‌గా చేసుకోవాలనుకున్న మొసలికి దురదృష్టం వెంటాడింది’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి ఇప్పటివరకు 3500కి పైగా వ్యూస్ రాగా.. 213 లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.