Elderly Couple: సంతోషానికి వయసుతో పనిలేదు.. తొలిసారి సముద్రాన్ని చూసి పరవశించిన వృద్ధజంట..

జీవితాంతం పల్లెకే పరిమితమైన ఆ వృద్ధ దంపతులకు వారి చిరకాల కోరికను తీర్చింది.. జీవితంలో మొదటిసారిగా వారిని ఓ సముద్రం ఒడ్డుకు తీసుకువెళ్లింది. అక్కడ వారు సముద్రాన్ని చూస్తూ అలల తాకిడికి ఆ జంట పొందిన పరవశం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

Elderly Couple: సంతోషానికి వయసుతో పనిలేదు.. తొలిసారి సముద్రాన్ని చూసి పరవశించిన వృద్ధజంట..
Elderly Couple

Updated on: Jan 12, 2026 | 2:50 PM

ప్రతి ఒక్కరి జీవితంలోనూ వేర్వేరు కలలు ఉంటాయి. కొందరి కలలు నిజమవుతాయి. మరికొందరి కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. జీవితాంతం కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దచేయటంలోనే తమ కలల్ని నేరవేర్చుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. అలాంటి ఓ వృద్ధ జంట కలను వారి మనవరాలు నెరవేర్చింది. జీవితాంతం పల్లెకే పరిమితమైన ఆ వృద్ధ దంపతులకు వారి చిరకాల కోరికను తీర్చింది.. జీవితంలో మొదటిసారిగా వారిని ఓ సముద్రం ఒడ్డుకు తీసుకువెళ్లింది. అక్కడ వారు సముద్రాన్ని చూస్తూ అలల తాకిడికి ఆ జంట పొందిన పరవశం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో మనకు తెలిసిపోతోంది. ఇంటర్‌నెట్‌లో కనిపించే ఎన్నో వింతలు, వినోదాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అందులో కొన్ని మనసుకు హత్తుకునేవి ఉంటాయి. మరికొన్ని స్ఫూర్తినిచ్చేవిగా ఉంటాయి. తాజాగా ఓ వృద్ధ జంటకు సంబంధించిన ఒక వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. జీవితంలో తొలిసారి సముద్రాన్ని చూసిన ఒక వృద్ధ జంట ఆనందం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలిస్తోంది. బీచ్‌లో వారి పరవశం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వారు సముద్రం దగ్గరకు వెళ్లగానే తాతయ్య, అమ్మమ్మ ఇద్దరూ ఆ నీటిని తాకి నమస్కరించారు. వారు సంతోషంగా ఉన్నారు. సముద్రపు ఇసుక, నీటిలో రెండు అడుగులు వేయడంతో వారి చిరకాల కోరిక నెరవేరిందని వారు సంతోషంగా ఉన్నారు. ఒక క్షణం వారు సముద్రపు నీటిని చూసి జీవితం ధన్యమైందని భావించారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఆ సాగరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న దృశ్యం సంతోషానికి వయసుతో పని లేదని నిరూపిస్తోంది. ఒకప్పుడు ప్రయాణాలు భారమై తీర్చుకోలేకపోయిన కోరికను వారి మనవరాలు ప్రేమతో తీర్చిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఈ వీడియో తెగ వైరలవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ అందమైన వీడియోను ముంబైకి చెందిన దివ్య తవ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన తాతయ్య, అమ్మమ్మ చివరి కోరిక సముద్రాన్ని చూడాలనేది. తాను వారి కోరికను నెరవేర్చానని చెప్పింది. తన జీవితాంతం విన్నదాన్ని నిజం చేశానని దివ్య భావోద్వేగానికి గురైంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలా మంది దివ్యను ప్రశంసించారు. వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..