
Egg or Chicken: కోడి ముందా? గుడ్డు ముందా? అని చాలా సరదాగా ప్రశ్నించుకోవడం తెలిసిందే. కొందరు దీన్ని సరదాగా తీసుకున్నా.. మరికొందరు సీరియస్‌గా తీసుకుంటారు. కోడి ముందా? గుడ్డు ముందా అని సమాధానం చెప్పేందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవం ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ చెప్పలేకపోయారు. ఈ కారణంగానే ఈ ప్రశ్న ఇప్పటికీ ప్రతీ ఒక్కరి మెదళ్లను తినేస్తుందనడంలో ఎలాంటి సందేశం. ఈ ప్రశ్నకు సమాధానం కనుగోనేందుకు ఏళ్ల తరబడి ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే, తాజాగా ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం దొరికింది. అమెరికాకు చెందిన సైంటింస్టులు దీనికి సంబంధించి ఓ థియరీ చెప్పుకొచ్చారు. గుడ్డు ముందా? కోడి ముందా? అనే దానికి వివరణ ఇచ్చారు. ఈ థియరీని అమెరికాలోని ఓ వెబ్‌సైట్ ప్రచురించింది.
అమెరికాకు చెందిన రాబర్ట్ క్రుల్విచ్ అనే జర్నలిస్ట్ ఈ సంక్లిష్టమైన కాన్సెప్ట్ గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు చేసి.. దానికి సంబంధించిన వివరాలను ఎన్‌పీఆర్ అనే అమెరికన్ బేస్‌డ్ వెబ్‌సైట్‌లో ప్రచురించారు. అసలు భూమిపై గతంలో కోళ్లే లేకుండే అని, పరిణామ క్రమంలో కోళ్లు ఉద్భవించాయని చెబుతున్నారు ఈ పరిశోధకలు. ఈ థియరీ ప్రకారం.. కోళ్లలా కనిపించే భారీ పక్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిపై నివసించాయి. జన్యూరంగా కోళ్లను పోలినట్లుగా ఉన్న ఆ పక్షి నుంచి కోడి ఉద్భవించింది. శాస్త్రవేత్తలు దీనిని ప్రోటో కోడిగా పేర్కొన్నారు. ఆ ప్రోటో కోడి గుడ్డు పెట్టగా.. అందులో జన్యుపరంగా అనేక ఉత్పరివర్తనలు జరిగడంతో కోడి పుట్టిందట. ఇలా నేడు మనం చూస్తున్న కోడికి.. పురాతన కాలంలో కోడిని పోలిన పక్షి పెట్టిన గుడ్డే కారణమని నిపుణులు తేల్చారు. వాస్తవానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి భూమిపై ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పక్షి పెట్టిన గుడ్డులో కూడా జన్యుపరమైన చర్యలు జరుగడంతో.. కోడి పుట్టుకొచ్చిందంటున్నారు. అంటే.. గుడ్డుకు ముందు కోడి లేదని, గుడ్డే ముందని తేల్చారు సైంటిస్టులు. ఫైనల్‌గా వారు చెప్పిందేంటంటే.. పూర్వం భూమిపై ఉన్న కోడి లాంటి పక్షి పెట్టిన గుడ్డు కారణంగా నేటి కోడి పుట్టింది అని. ఇలా కోడి ముందా? గుడ్డు ముందా? అనే థియరీకి సమాధానం తేల్చేశారు.
Also read:
Viral Video: బ్రేక్‌కు బదులుగా యాక్సలేటర్ రేజ్ చేశాడు.. ఆ తరువాత జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..