పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు దుర్గమాతను వినూత్న పద్ధతిలో ఏర్పాటు చేశారు కొందరు నిర్వాహకులు. కోల్‌కతాలోని లాలాబాగన్ నబన్ కూర్ వద్ద దుర్గామాతను పర్యావరణహితంగా రూపొందించారు. మండపంలో ఆహ్లదకరమైన వాతావరణంలో నెలకొల్పిన అమ్మవారి ప్రతిమలను వెదురు, మనీ ప్లాంట్, కూరగాయలు, పలు రకాల పండ్లతో అలంకరించారు. దుర్గామాత ప్రతిమ రూపకల్పనకు ఐదు నెలలు శ్రమించిన సిబ్బంది, ఇందుకోసం సుమారు 8వేల మొక్కలను ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
West Bengal: In a unique initiative to raise awareness about environmental conservation, an eco-friendly Durga Puja pandal has been set up at Lalabagan Nabankur in Kolkata with a remarkable twist. The idol of the Hindu goddess Durga has been adorned with 8,000 natural plants,… pic.twitter.com/VrOaJ5GSfU
— IANS (@ians_india) October 3, 2024
పర్యావరణ ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ మండపాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ వినూత్న డిజైన్ సందర్శకుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా పచ్చదనం, ప్రకృతిని సంరక్షించడం ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..