Friendship Day Special: ‘స్నేహం’.. పలకడానికి ఇది చిన్న పదం.. కానీ, ఆ స్నేహ బంధాన్ని ఆస్వాదించే వారికి తెలుసు.. ఎంత మధురమైనదో.. ఎంత ప్రేమ ఆ స్నేహంలో దాగి ఉంటుందో. స్నేహం కోసం ప్రాణాలర్పించిన స్నేహితులు ఎంతో మంది ఈ భూమిపై ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచంలో తనకంటూ ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ.. స్నేహితులు లేకపోతే ఆ జీవితమే వ్యర్థం అనే వాళ్లు కోకొల్లలు. ఇలాంటి స్నేహానికి ప్రతీకగా.. ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. అయితే, ఈ స్నేహ బంధం కేవలం మనుషులకే కాదు.. జంతువల్లో మైత్రం బంధం చాలా బలంగా ఉంటుంది. సజాతి జంతువుల మధ్యే కాదు.. జాతి బేధం ఉన్న జంతువుల మధ్య కూడా స్నేహం చిగురిస్తుంది. అలాంటి స్నేహానికి సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట్లో మనకు సాక్షాత్కరిస్తుంటాయి. ఆవు, చిరుత.. కోతి, కుక్క.. ఆవు, కుక్క.. పిల్లి, కుక్క.. ఇలా రకరకాల జంతువుల మధ్య స్నేహానికి సంబంధించిన వీడియోలు ఎన్నో చూశాం. తాజాగా ఓ కోతి పిల్ల, బాతు పిల్లల స్నేహానికి సంబంధించిన క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోతిపిల్ల, కొన్ని బాతు పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటూ.. అల్లరి చేస్తూ ఉన్నాయి. ఈ క్యూట్ స్నేహానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఈ వీడియోలో అనేక బాతులు, కోతులు ఒకదానితో మరొకటి సరదాగా గడుపుతున్నాయి. ఆడుకుంటూ, ఉరుకులు పరుగులు తీస్తూ.. ఫుల్ మస్తీ చేశాయి. కొన్నిసార్లు ఆ కోతిపిల్ల బాతు పిల్లలకు దారి చూపిస్తోంది. బాతు పిల్లలకు ముద్దులు పెడుతూ.. వాటిని పట్టుకుని రచ్చ రచ్చ చేసింది కోతి పిల్ల. ఇక అన్నీ కలిసి నిద్రపోవడం చూడముచ్చటగా అనిపిస్తుంటుంది. గార్డెన్‌లో కోతి పిల్ల పడుకోగా.. దాని చుట్టూ బాతు పిల్లలు పడుకున్నాయి. ఇలా సరదాగా అవి గడుపాయి. అయితే, వీటిని స్నేహాన్ని, అల్లరి పనులను కొందరు వీడియో తీయగా.. ఆ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా ఫ్రెండ్‌షిప్ డే వేళ.. ట్రెండింగ్‌గా మారింది. కోతి, బాతు పిల్లల క్యూట్ ఫ్రెండ్‌షిప్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నిజమైన స్నేహానికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయని కొనియాడుతున్నారు. ఈ వీడియోను శనివారం నాడు పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 12 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. రెండు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. మరి ఈ క్యూట్ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
बच्चे मन के सच्चे…??☺️@ParveenKaswan @ipskabra pic.twitter.com/RaLDgvEYfm
— Rupin Sharma IPS (@rupin1992) July 31, 2021
Also read:
Significance of Kumkum: హిందూ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకున్న ప్రాధాన్యత ఏమిటో తెలుసా
Tokyo Olympics 2020 Live: టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్యం పతకం గెలిచిన తెలుగుతేజం పీవీ సింధు