Ducks save penguin life: స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.. అనే పాట తెలుగు ప్రేక్షలకు ఎప్పటికీ సుపరిచతమే.. ప్రాణ స్నేహితులు సినిమాలోని ఈ పాటను ఫ్రెండ్స్ అంతా ఎప్పుడూ.. గుర్తు చేసుకుంటునే ఉంటారు. అయితే.. తాజాగా అలాంటి స్నేహానికి నిదర్శనంగా నిలిచాయి మూగజీవాలు.. పెంగ్విన్ పిల్లను వేటాడేందుకు వచ్చిన డేగలకు బాతులు దిమ్మతిరిగే షాకిచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్నేహం బంధం ఎప్పటికీ శాశ్వతం అంటూ నిరుపించాయి మూగ జంతువులు. పెంగ్విన్ ఆపదలో ఉంటే ఆదుకొని.. తాము కూడా మనస్సున్న మంచి స్నేహితులం అంటూ నిరుపించాయి బాతులు. ఈరోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో జంతువుల్లో దాగున్న ప్రేమ, స్నేహబంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇది చూసిన తర్వాత స్నేహం బంధం ప్రపంచంలో ఎందుకు అత్యంత ప్రత్యేకమైనదో అర్థమవుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. నీటి ఒడ్డున ఉన్న పెంగ్విన్ పిల్లను వేటాడేందుకు డేగలు చేరుకున్నాయి. దానిని చుట్టుముట్టి.. చంపేందుకు ప్రయత్నిస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. డేగలు ముక్కుతో పెంగ్విన్‌ని పొడుస్తూ.. ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. డేగల దాడితో పెంగ్విన్ పిల్ల గాయపడుతుంది. ఆపదలో ఉన్న పెంగ్విన్ పిల్లను చూసి చలించిపోయిన బాతులు.. వెంటనే పరుగులు తీస్తూ అక్కడికి చేరుకుంటాయి. వెంటనే పెంగ్విన్‌ను కాపాడి వేటాడే పక్షులను వెంటాడుతాయి. పెంగ్విన్ జొలికొస్తే ఉరుకునేది లేదంటూ ఆ ప్రాంతం నుంచి డేగలను తరుముతాయి.
వీడియో చూడండి
The penguin is being rescued by the ducks… Amazing I want to cry! ??
— Figen (@TheFigen) June 24, 2022
ఈ వీడియోను @TheFigen అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. వార్త రాసే వరకు 20 లక్షల మందికి పైగా చూశారు. దీంతోపాటు స్నేహం అంటే ఇదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి