Viral Video: నాతోనే గేమ్సా.. వేటాడేందుకు వచ్చిన పులితో దాగుడుమూతలు ఆడిన బాతు..! వీడియో వైరల్

Duck Playing game with Tiger: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో పులులు ఒకటి. వాటిని అందమైన, అద్భుతమైన జీవులుగా

Viral Video: నాతోనే గేమ్సా.. వేటాడేందుకు వచ్చిన పులితో దాగుడుమూతలు ఆడిన బాతు..! వీడియో వైరల్
Duck Playing Game With Tige

Updated on: Dec 27, 2021 | 10:48 AM

Duck Playing game with Tiger: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో పులులు ఒకటి. వాటిని అందమైన, అద్భుతమైన జీవులుగా కూడా పరిగణిస్తారు. జూ లేదా అటవీ ప్రాంతాల్లో దగ్గరగా అందమైన చారలతో పులిని చూస్తే.. భయంతోపాుట థ్రిల్ కూడా కలుగుతుంది. అయితే.. పులులకు సంబంధించిన చాలా రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా.. వేటాడే వీడియోలు ఎక్కువగా కనిపిస్తాయి. నెటిజన్లు కూడా అలాంటి వీడియోలనే ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారు. ఈ రోజుల్లో ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కానీ పులి అందులో వేటాడదు. కానీ అది వేటాడే ప్రయత్నంలో విఫలమవుతూ ఉంటుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు పులికి ఎన్ని కష్టాలోచ్చాయో అనుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు.

ఈ వైరల్ వీడియో.. పులి – బాతుకి సంబంధించినది. దీనిలో పులి నీటిలో ఈదుతున్న బాతుని వేటాడేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ పులి తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని బాతు కూడా తెలుసుకుంటుంది. అయితే.. పులి తన దగ్గరగా వస్తున్న క్రమంలో బాతు నీటిలో మునిగుతూ.. మరోచోట ప్రత్యక్షమవుతూ కనిపిస్తుంటుంది. ఆ తర్వాత పులి మరోచోట బాతును చూడగానే అక్కడికి వెళుతుంది. మళ్లీ అక్కడి నుంచి బాతు మరోచోటకు మాయమవుతుంది. దీంతో పులి వేటాడేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పులితోనే ఈ బాతు దాగుడుమూతలు ఆడుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో..

ఈ ఫన్నీ వీడియోని నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను @buitengebieden_ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 46 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 30 వేలకు పైగా వీక్షించగా, 5 వేల మందికి పైగా లైక్ చేశారు. దీంతోపాటు తమదైన స్టై్ల్‌లో కామెంట్లు చేస్తున్నారు. బాతు ఎత్తుగడకు పులి చిన్నబోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: మ్యాజిక్ చూసి ఫిదా అయిన చింపాజీ.. రియాక్షన్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వీడియో

Viral video: మ్యూజిక్‌ షూట్‌లో చేదు అనుభవం.. సింగర్‌ ముఖంపై కాటేసిన పాము.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..