బాబోయ్‌ భరించలేం.. వెరైటీ పానీపూరి కాంబినేషన్‌ చూసి భగ్గుమంటున్న నెటిజన్లు..! వీడియో చూస్తే

|

Feb 03, 2025 | 1:36 PM

పానీ పూరి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఇష్టమైనదిగా మారింది. నిజానికి ఇది తీపి, పులుపు, కారం కలయికతో అద్భుతమైన రుచిలో ఉంటుంది. అలాగే, కునాఫా స్వీట్‌ దుబాయ్‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. స్వీట్స్‌ లవర్స్‌ దీన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాంటిది ఈ రెండు వెరైటీ కాంబినేషన్ ఫుడ్స్‌ని కలిపి తయారు చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా..

బాబోయ్‌ భరించలేం.. వెరైటీ పానీపూరి కాంబినేషన్‌ చూసి భగ్గుమంటున్న నెటిజన్లు..! వీడియో చూస్తే
Kunafa Chocolate Pani Puri
Follow us on

భోజన ప్రియులు ఆహార రుచిని తారుమారు చేస్తే సహించరు. అయితే, ఇప్పుడు కొత్త ప్రయోగాల ద్వారా కాక్ టెయిల్ వంటకాలు చేసే ట్రెండ్ మొదలైంది. కొన్నిసార్లు అవి చాలా వింతగా కనిపిస్తుంటాయి. వాటిని చూస్తేనే ప్రజలు వికారం అనుభూతి చెందుతారు. ఈ క్రమంలోనే ఇటీవల, కొన్ని రకాల స్వీట్లతో కలిపి పానీపూరి వంటకాన్ని అందిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజనం సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వింత పానీపూరి వంటకం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇటీవల, దుబాయ్‌లోని ఓ కేఫ్‌లో ‘కునాఫా చాక్లెట్ పానీ పూరీ’ సర్వ్‌ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చాలా వింతైన వంటకం. దాని గురించి ఆలోచిస్తే చాలా మంది పానీ పూరీ ప్రియులు కలత చెందుతున్నారు. పానీ పూరి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఇష్టమైనదిగా మారింది. నిజానికి ఇది తీపి, పులుపు, కారం కలయికతో అద్భుతమైన రుచిలో ఉంటుంది. అలాగే, కునాఫా స్వీట్‌ దుబాయ్‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. స్వీట్స్‌ లవర్స్‌ దీన్ని ఎక్కువ ఇష్టంగా తింటారు. అలాంటిది ఈ రెండు వెరైటీ కాంబినేషన్ ఫుడ్స్‌ని ఇప్పుడు దుబాయ్‌లోని భుక్కడ్ కేఫ్‌లో కునాఫా, పానీపూరీ పేరిట కలిపి అందిస్తున్నారు. ఇది చూసిన చాలా మంది ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. చాలా మంది ఇదేం వికారమైన తిండిరా బాబోయ్‌ అంటూ మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

z.blogs ఒక ఫుడ్ వ్లాగర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. క్లిప్‌లో వ్లాగర్ పానీ పూరీ లోపల కరిగించిన చాక్లెట్‌ను పోస్తున్నట్లు చూపించారు. వీడియో ‘జహ్రా ఇ సయ్యద్’ హ్యాండిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా, ఈ పోస్ట్‌ను వేలాది మంది లైక్ చేశారు. కానీ దీనిని చెత్త వంటకం అంటూ పెద్ద సంఖ్యలో నెటిజన్లు కామెంట్లు కుమ్మరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..