
కుక్కలు, పిల్లుల వీడియోలతో సహా అనేక వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతువులు, పెంపుడు జంతువులకు సంబంధించిన అందమైన వీడియోలను చూసేందుకు ప్రజలు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటిదే వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక అందమైన వీడియో ప్రజల హృదయాలను దోచుకుంటోంది. ఇందులో ఒక పెంపుడు కుక్క చేస్తున్న పని నెటిజన్లను కట్టిపడేసేలా కనిపించింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. రోజూ క్రమం తప్పకుండా తన వద్దకు వచ్చే వ్యక్తి కోసమే అని తెలుస్తోంది. అవును, అది ప్రతిరోజూ వచ్చే పండ్ల విక్రేత కోసం ఎదురు చూస్తోందని ఆ తరువాత తెలిసింది. ఎలాగంటే.. ఆ వీడియోలో కనిపించిన ఆ కుక్క పండ్ల వ్యాపారిని దూరం నుండి చూడగానే ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అతను తన దగ్గరికి వచ్చే వరకు అదే ఎంతో అత్రుతంగా ఎదురు చూస్తుండటం కనిపించింది. పండ్ల వ్యాపారి అక్కడికి వచ్చి, తన బండి నిండా పండ్లను ఆపి, దాని నుండి ఒక పండు తీసుకొని కుక్క దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ కుక్క తన తోకను ఆపకుండా ఊపడం మీరు చూడవచ్చు. ఇక ఆ తర్వాత పండ్ల వ్యాపారి ఆ కుక్కపై ప్రేమతో.. దగ్గరగా వచ్చి ఆ పండు తొక్క తీసి, విరిచి కుక్కకు తినిపిస్తున్నాడు. ఆ కుక్క కూడా అంతే వేగంగా ఆ పండు తింటోంది.
ఈ వీడియో misty_eva_mauli, missevas_pethouse ఖాతాల నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. వీడియో క్యాప్షన్‌లో ‘క్యూట్ లిటిల్ ఫ్రూట్ టాక్స్ కలెక్టర్’ అని ఉంది. వీడియో చూస్తుంటే.. క్యాప్షన్‌కి తగ్గట్టుగానే ఇది ఆ కుక్క రోజువారీ దినచర్య అని తెలిస్తోంది. ఈ అందమైన వీడియో చూసిన నెటిజన్లు మరింత అందంగా స్పందించారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాసుకొచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..