సాధారణంగా చాలా మంది ఇళ్లలో కుక్కలను.. పిల్లులను పెంచుకుంటారు. వీటిలో అత్యంత విశ్వాసంగా పనిచేసేది ఏది అంటే కుక్క అని సులువుగా చెప్పేస్తారనుకోండి. అవును కదా.. ఒక్కపూట భోజనం పెడితే.. రోజూ.. ఆ ఇంటి దగ్గరే కాపలాగా ఉంటుంది. అన్నం పెట్టి కృతజ్ఞతతో.. ఆ ఇంటికి రక్షకుడిగా మారిపోతుంది. అందుకే విశ్వాసంలో పెంపుడు కుక్కకు ఏది సాటిరాదు అంటారు. అలాగే అవి తమ యాజమానులపై చూపే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. అవి రకరకాలుగా తమ యాజమానులపై ప్రేమను చూపిస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కానీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ పెంపుడు కుక్క చేసిన పనికి మీరు కూడా శభాష్ అంటారు. ఆ వీడియోలో తన తల్లితో కలిసి ఓ వ్యక్తి భోజనం చేస్తున్నాడు. వారిద్ధరి మధ్యలో వాళ్ల పెంపుడు కుక్క కూడా కూర్చుంది. అయితే తన కొడుకుకు ఎంతో ప్రేమతో ఆహారాన్ని తీసి పెట్టింది ఆ తల్లి. అయితే వెంటనే చిరాకుగా ఆ ఆహారాన్ని నెలకేసి కొట్టాడు ఆ వ్యక్తి. దీంతో వెంటనే పక్కనే ఉన్న పెంపుడు కుక్క.. ఆ వ్యక్తిపై విరుచుకుపడింది. ఆహారాన్ని తీసుకునేంతవరకుు ఆ వ్యక్తిని తన కాళ్లతో కొట్టింది. దీంతో ఆ వ్యక్తి పడేసిన ఆహారాన్ని తీసుకుని తింటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మనుషులతోపాటు.. జంతువులకు కూడా సమాన ప్రేమలు ఉంటాయని… తన యాజమాని ప్రవర్తన ఇష్టపడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Also Read: Samantha: మధ్యలో చిన్న చిన్న క్షణాలు.. ఇంతకీ ఫోటోతో సమంత ఏం చెప్పాలనుకుంటుంది..
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో.. మహేష్ కళావతి సాంగ్ అదుర్స్..