Viral Video: యజమాని కాలికి గాయం.. కాపడం పెడుతున్న పెంపుడు కుక్క.. నెటిజన్లు ఫిదా..!

|

Dec 02, 2021 | 5:42 AM

Viral Video: సహజంగానే కుక్కలకు విశ్వాసం ఎక్కువ. కొన్ని కుక్కలకు అయితే మరీ ఎక్కువ ఉంటుంది. తనకు ఒక్క పూట ఆహారం పెట్టినవారి ఇంటికి కాపాలా కాస్తుంది.

Viral Video: యజమాని కాలికి గాయం.. కాపడం పెడుతున్న పెంపుడు కుక్క.. నెటిజన్లు ఫిదా..!
Dog
Follow us on

Viral Video: సహజంగానే కుక్కలకు విశ్వాసం ఎక్కువ. కొన్ని కుక్కలకు అయితే మరీ ఎక్కువ ఉంటుంది. తనకు ఒక్క పూట ఆహారం పెట్టినవారి ఇంటికి కాపాలా కాస్తుంది. ఇక, పెంపుడు శునకాలైతే ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవడమే కాదు. యజమాని ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డేస్తుంది. కుక్క విశ్వాసానికి ఇప్పటికే అనేక సంఘటనలు చూశాం. తాజాగా మరో వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఏం కుక్క రా బాబూ.. ఇలాంటి కుక్క ఒక్కటి ఉన్నా చాలా అంటూ మురిసిపోతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.. వీడియోలో కనిపిస్తున్న శునకం.. తన యజమాని కోసం ఆరాటపడుతోంది. అతనికి పాదాన్ని ఏదో బలమైన దెబ్బ తగిలినట్లుంది. దాంతో నొప్పి నుంచి ఉపశమనం కోసం అతడు కాపడం పెట్టుకోవడం, మర్ధన చేయడం వంటివి చేస్తున్నాడు. అయితే, ఇదంతా ఆ కుక్క పక్కనే ఉండి గమనిస్తుంది. అతడు కాలి నొప్పితో పడుతున్న బాధను ఆ నోరులేని శునకం అర్థం చేసుకుంది. అందుకే తన పక్కనే కూర్చుని యజమానికి సేవలు చేస్తోంది. దెబ్బతగిలిన యజమాని కాలుని కుక్క తన నాలికతో నాకుతోంది. ఆ తర్వాత నొప్పిగా ఉన్న అతని కాలిపై వెచ్చగా ఉండేందుకు ఆ కుక్క తన మెడను వాల్చి పడుకుంటుంది. ఇదంతా వీడియో తీసిన ఆ కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దాంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు కుక్క విశ్వాసానికి ఫిదా అవుతున్నారు. భిన్నమైన కామెంట్లతో కుక్కను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు.

Viral Video:

Also read:

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..