
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతున్నాయి. అయితే జూలో ఉండే క్రూర జంతువులు సాధారణంగా ట్రైనర్ నియంత్రణలో ఉంటాయి. ఒక్కోసారి అవి వారి మాటల్ని కూడా వినకుండా దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఓ శునకం మాత్రం రెండు వన్యమృగాలను కంట్రోల్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఓ జూలో ఓ పులి, సింహం ఒకదానికొకటి నువ్వా నేనా అంటూ పోట్లాడుకుంటున్నాయి.
దీంతో ఒక్కసారిగా అక్కడున్న ఓ కుక్క ఆ రెండింటిని దెబ్బలాడుకోకుండా చేసింది. ఇంకా పులి చెవిని కరుస్తూ కూడా సింహంతో గొడవ పడటాన్ని ఆపింది. అయితే ఒకవేళ పులి దాడి చేస్తే ఆ కుక్క చనిపోవడం ఖాయం. కాని ఆ కుక్క మాత్రం కొంచెం కూడా బెదరకుండా వాటి మధ్య పోట్లాటను ఆపింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
Dog stops tiger and lion from fighting pic.twitter.com/O2qfgk9q4v
— B&S (@_B___S) May 20, 2023
మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..