శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అన్న ఆరోక్తి గురించి తెలిసిందే.. ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పెంపుడు జంతువులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి అందమైన కుక్క వీడియో ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఈ వీడియోను నెటిజన్లు బాగా అభినందిస్తున్నారు. వీడియోలో కుక్క తన యజమాని చెప్పినట్లుగా రామనామ జపించడం చూడవచ్చు.
హిందూమతంలో రామ అనే రెండు అక్షరాలను పఠించడం మనస్సుకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. దీంతో పాటు రామ నామ స్మరణతో పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అందుకనే ఇంట్లోని పెద్దలు తమ చిన్నారులకు రామ నామ తారక మంత్రాన్ని నేర్పడమే కాదు జై శ్రీ రాం అంటూ కీర్తిస్తారు కూడా.. అయితే ఎవరైనా ఇప్పటి వరకూ రామ చిలుక మాట్లాడడం మాత్రమే తమ యజమాని మాటలను అనుసరించి మాట్లాడం చూసి ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలో ఒక వ్యక్తీ తన పెంపుడు కుక్క రామ నామ స్మరణ అది కూడా ఎలా ఏ విధంగా చేయాలో కూడా నేర్పిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది.
When the bhakti of previous births is awakened again… pic.twitter.com/i5Uw6zaJGP
— Ranvijay Singh (@ranvijayT90) September 17, 2024
వైరల్ వీడియోలో యజమాని చెప్పినట్లుగా “రామ్ రామ్ రామ్” అని కుక్కను చూడవచ్చు. ఈ వీడియో @ranvijayT90 అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రతిచోటా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కొంతమంది గత జన్మ జ్ఞాపకాలు అని అని వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..