పెంపుడు కుక్క పేరు శర్మ.. పోలీస్‌ స్టేషన్‌కు చేరిన పంచాయితీ! ఇదేం గోల రా స్వామి..

కుక్కకు 'శర్మ' అని పేరు పెట్టడం వల్ల పొరుగువారితో గొడవ జరిగింది. పక్కింటి వారి ఇంటిపేరు కూడా శర్మ కావడంతో, కుక్కను 'శర్మ' అని పిలవడం వారికి అవమానంగా అనిపించింది. ఈ వివాదం పెరిగి, గొడవకు దారితీసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగిసింది.

పెంపుడు కుక్క పేరు శర్మ.. పోలీస్‌ స్టేషన్‌కు చేరిన పంచాయితీ! ఇదేం గోల రా స్వామి..
Dog

Updated on: Sep 13, 2025 | 7:04 AM

ఓ యజమాని తన పెంపుడు కుక్కకు శర్మ అని పేరు పెట్టాడు. అదేంటి శర్మ అని కొంతమందికి సర్‌నేమ్‌ ఉంటుంది కదా మరి అలా ఎందుకు పెట్టాడు అని మీకు డౌట్‌ రావొచ్చు. దాని వెనుక పెద్ద కథ ఉంది. ఇక కుక్కకు శర్మ అని పేరు పెట్టి, పదే పదే దాన్ని శర్మ జీ.. శర్మ జీ అని పిలిచేవాడు. అది విన్నప్పుడుల్లా పక్క ఇంట్లో వారికి మండిపోయేది. అలా ఎందుకంటే.. అదే ట్విస్టు. అసలింతకీ మ్యాటర్‌ ఏంటంటే..?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన భూపేంద్ర సింగ్ తన కుక్కకు ‘శర్మ’ అని పేరు పెట్టాడు. అతను అలా కుక్కకు ఆ పేరు పెట్టడంతో పక్కింట్లో ఉండే వీరేంద్రను తీవ్రంగా బాధపెట్టింది. ఎందుకంటే అతని ఇంటి పేరు కూడా శర్మ. భూపేంద్ర ఉద్దేశపూర్వకంగా ఆ కుక్కను శర్మ జీ అని పిలిచాడని, స్నేహితుల ముందు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని వీరేంద్ర ఆరోపించారు. కుక్కకు శర్మ అని పేరు పెట్టడంపై వీరేంద్ర భార్య కిరణ్ శర్మ అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది చివరికి గొడవకు దారితీసింది.

ఈ గొడవలో భూపేంద్ర, అతని ఇద్దరు సహచరులు తమపై దాడి చేశారని వీరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా రాజేంద్ర నగర్ పోలీసులు భూపేంద్ర సింగ్, అతని ఇద్దరు సహచరులపై కేసు నమోదు చేశారు. ఈ వివాదం సున్నితమైన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి