Viral: రక్తదానం చేసి మరో కుక్క ప్రాణం నిలిపిన శునకం

|

Aug 01, 2024 | 12:51 PM

మనుషులు రక్తదానం చేయడం విన్నాం, చూశాం. జంతువులు రక్తదానం చేయడం ఎప్పుడైనా చూశారా? కర్నాటక కొప్పల్‌లో ఓ పెంపుడు కుక్క బుధవారం మరో పెట్ డాగ్‌కు రక్తదానం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

Viral: రక్తదానం చేసి మరో కుక్క ప్రాణం నిలిపిన శునకం
Dog Blood Donation
Follow us on

రక్తదానం చేస్తే.. ఒక ప్రాణాన్ని నిలిపినట్టే భావించాలి. ఈ రోజుల్లో సరైన సమయానికి రక్తం దొరక్క కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఇప్పటివరకు మనుషులు మాత్రమే రక్తదానం చేస్తారని మీకు తెలిసి ఉంటుంది. అయితే కుక్కలు కూడా రక్తాన్ని దానం చేసి సాటి ప్రాణాన్ని నిలబెట్టిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన కర్నాటక కొప్పల్‌లో చోటుచేసుకుంది. కొప్పల్‌లోని ఓ పెంపుడు కుక్క బుధవారం మరో కుక్కకు రక్తదానం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నగరంలోని ఓ వెటర్నరీ క్లినిక్‌లో ప్రొఫెసర్ బసవరాజ పూజర్‌కు చెందిన పెంపుడు కుక్క మూడేళ్ల భైరవ్ (డాబర్ మ్యాన్) రక్తదానం చేసింది.

నగర్‌కు చెందిన 9 ఏళ్ల లాబ్రడార్ కుక్క అనారోగ్యానికి గురైంది. దాని హిమోగ్లోబిన్ స్థాయి కూడా తీవ్రంగా పడిపోయింది. దీంతో వెటర్నరీ డాక్టర్ రక్తం ఎక్కించకపోతే.. అది కోలుకోవడం కష్టం అని చెప్పారు. సదరు డాక్టర్ నగరంలోని మూడు కుక్కల యజమానుల చిరునామాలు సేకరించి.. వాటిని పిలిపించి రక్త నమూనాలను పరీక్షించారు. మూడు కుక్కల నమూనాలలో ప్రొ. బసవరాజ్ పూజర్‌కు చెందిన 3 ఏళ్ల డోబర్‌మన్ జాతికి చెందిన రక్తం సరిపోలడంతో వైద్య నిబంధనల ప్రకారం 12 నిమిషాల్లో 300 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి.. అనారోగ్యంతో ఉన్న లాబ్రడార్‌కు అందించారు. ప్రస్తుతం అది కోలుకుంటుదని వైద్యులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..