Viral Video: మనీ కోసం రంగు మార్చిన కుక్క.. వీడియో చూస్తే నవ్వులు పూయాల్సిందే..
ఈ వీడియోను లో+వైరల్ అనే సోషల్ మీడియా ట్విట్టర్ నుంచి షేర్ చేశారు. దాని క్యాప్షన్‌లో ఫస్ట్ ద గేమ్ అని క్యాఫ్షన్ అందించారు. ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియో 25 వేలకు పైగా వ్యూస్ పొందింది.

Trending Video: సోషల్ మీడియాలో ఓ కుక్కకు చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో, ఒక కుక్క బీచ్ రోడ్డులో కూర్చుని తన జీవనోపాధి కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ప్రజలు కూడా ఈ కుక్కకు విరాళాలు ఇస్తుండడం వీడియోలో చూడొచ్చు. అయితే, ఇందుకోసం కోసం కుక్కను పూర్తిగా మార్చేశారు. కార్పెట్ మీద కూర్చున్న డాగీ సన్ గ్లాసెస్, నోటిలో సిగార్ పైపు, తలపై కౌబాయ్ టోపీ ధరించి ఉంది. ఇది కాకుండా, బ్లూ కలర్ జెర్సీ ధరించి ఉంది. కుక్క వద్ద ఒక పిగ్గీ బ్యాంకు, ఒక ప్లాంక్ కూడా ఉంచారు. విరాళం ఇవ్వండి లేదా సహాయం చేయండి అని ఈ బోర్డుపై రాసి ఉంది.
అదే సమయంలో కొంతమంది అమ్మాయిలు అందమైన డాగీని చూసి, ఎంతో ముచ్చటపడ్డారు. వాళ్ళలో ఒకామె డబ్బులు ఇవ్వగానే, ఆ డాగీ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మరికొందరు అమ్మాయిలు వెళ్లి పిగ్గీ బ్యాంకులో కొంత డబ్బు ఉంచడం చూడొచ్చు.




First the money pic.twitter.com/66uWgSgqLO
— Lo+Viral ? (@TheBest_Viral) December 1, 2022
ఈ వీడియోను లో+వైరల్ అనే సోషల్ మీడియా ట్విట్టర్ నుంచి షేర్ చేశారు. దాని క్యాప్షన్‌లో ఫస్ట్ ద గేమ్ అని క్యాఫ్షన్ అందించారు. ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియో 25 వేలకు పైగా వ్యూస్ పొందింది. అదే సమయంలో వేయి మంది దీన్ని లైక్ చేశారు. కాగా, కొందరు కామెంట్ చేస్తూ డాగీని ప్రశంసిలతో ముంచెత్తారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
