జమ్మూ కశ్మీర్ లో మంగళవారం రాత్రి భూకంపం రావడం అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. దాదాపు కొన్ని సెంకడ్ల పాటు భూమి కంపించడంతో ఆందోళన చెందారు. అయితే అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహర అనే ఆసుపత్రిలో ఓ సర్జరీ జరుగుతోంది. ఆ సమయంలోనే ఒక్కసారిగా భూమి కంపించడంతో వైద్యులు ఆందోళ చెందారు. అయినప్పటికీ తమ సర్జరీని కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైద్యుల పై నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అఫ్గానిస్తాన్ కు ఆగ్నేయ దిశగా దాదాపు 6.6 మ్యాగ్నిట్యూట్ తో భూకంపం సంభవించినట్లు యూఎస్ జీయోలాజికల్ సర్వీసస్ వెల్లడించింది. సుమారు 190 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని పేర్కొంది. అయితే ఈ భూకంప ప్రభావం ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించింది. ఢిల్లీ, కశ్మీర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల ప్రజలు భూకంప ప్రకంపనలు ఎదుర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..