Viral Video: మారుతోన్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ మారుతూనే ఉంటుంది. జీన్స్ ప్యాంట్‌లు ఎన్నో ఏళ్ల నుంచి అందుబాటులోకి ఉన్నా నిత్యం మార్పులకు లోనవుతూ యూత్‌ను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు బూట్ కట్ ప్యాంట్‌లను యువత ఎంతగానో ఇష్టపడేది. ఆ తర్వాత పెన్సిల్ కట్ ప్యాంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రస్తుతం టోన్ జీన్స్, స్టోన్ వాష్ జీన్స్, రిప్ప్‌డ్ జీన్స్ పేర్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. చిరిగినట్లు ఉండే జీన్స్‌కు ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్ ఉంది. ఇక ఒకప్పుడు ప్యాంట్‌లు మొత్తం ఒకే కలర్‌లో ఉండేవి.. కానీ ప్రస్తుతం షర్ట్స్‌లాగే ప్యాంట్‌లు కూడా రంగుల కలయికలో తయారు చేస్తున్నారు.
ఇలా జీన్స్ ప్యాంట్‌లలో అందుబాటుకలోకి వచ్చిందే స్టోన్ వాష్ జీన్స్. బ్లూ కలర్ ప్యాంట్‌పై వైట్ కలర్‌లో ఉండే డిజైన్‌లను యూత్ ఎక్కువగా ఇష్టపడుతోంది. అయితే ఈ ప్యాంట్‌లపై ఆ రంగులు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఇందుకోసం తయారీదారులు లేజర్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. లేజర్ లైట్‌ను ప్యాంట్‌పై మూవ్ చేయడం ద్వారా స్టోన్ వాష్, రిప్‌డ్ జీన్స్‌లను రూపొందిస్తారు. ఈ జీన్స్ తయారీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జీన్స్ తయారీ వీడియోను చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. మరి మీరు వేసుకుంటున్న జీన్స్‌ను ఎలా తయారు చేస్తారో మీరూ చూసేయండి..
How Jeans Are Stonewashed And Ripped pic.twitter.com/vaE7E15nNL
— How Things Work (@wowinteresting8) July 11, 2022
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..