Video: దీపావళికి ఇవా ఇచ్చేది..? ఛల్‌ మాకొద్దు పో..! కంపెనీ గేట్‌ ముందు సోన్‌పాపిడీ బాక్స్‌ల కుప్ప..

దీపావళి పండుగకు కంపెనీలు ఇచ్చే గిఫ్ట్స్‌పై ఉద్యోగుల అసంతృప్తి వ్యక్తమైంది. పదేపదే సోన్‌పాపిడీ ఇవ్వడంపై విసుగెత్తిన ఓ కంపెనీ ఉద్యోగులు, వాటిని కంపెనీ గేటు ముందు కుప్పగా పోశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Video: దీపావళికి ఇవా ఇచ్చేది..? ఛల్‌ మాకొద్దు పో..! కంపెనీ గేట్‌ ముందు సోన్‌పాపిడీ బాక్స్‌ల కుప్ప..
Soan Papdi As A Diwali Gift

Updated on: Oct 21, 2025 | 7:29 PM

పండగల్లో దీపావళి పండగ చాలా స్పెషల్‌. కులమతాలతో సంబంధం లేకుండా అందరూ టపాసులు పేల్చుతూ చిన్నా పెద్దా సంతోషంగా గడుపుతుంటారు. ఇంత స్పెషల్‌ పండగ కావడంతో దాదాపు అన్ని కంపెనీలు కూడా ఈ శుభ సంతోషంలో తమ సంస్థ ఎదుగుదలకు పాటుపడుతున్న ఉద్యోగులకు స్పెషల్‌ గిఫ్ట్స్‌ ఇస్తుంటాయి. ఎక్కువగా స్వీట్‌ బాక్సులు ఇస్తుంటారు.

అయితే కొన్ని కంపెనీలు మాత్రం ప్రతీసారి ఓ పావుకిలో సోన్‌పాపిడీ డబ్బా ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉంటారు. ఉద్యోగులు కూడా అయిష్టంగానే వాటిని తీసుకుంటారు. అయితే ఈసారి ఓ కంపెనీ ఉద్యోగులు మాత్రం తమ అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. దీపావళి గిఫ్ట్‌గా కంపెనీ ఇచ్చిన సోన్‌పాపిడీ బాక్సులను కంపెనీ గేటు ముందు కుప్పగా పోశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి