Viral: ఆ ఫోటో ఏకంగా రూ. 3.7 కోట్లకు అమ్ముడైందట.! ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.?

|

May 01, 2021 | 11:15 AM

దురదృష్టం వందసార్లు తలుపు తడితే.. అదృష్టం ఒక్కసారైనా తలుపు తడుతుందట! అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు..

Viral: ఆ ఫోటో ఏకంగా రూ. 3.7 కోట్లకు అమ్ముడైందట.! ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.?
Disaster Girl
Follow us on

Viral Meme Update: దురదృష్టం వందసార్లు తలుపు తడితే.. అదృష్టం ఒక్కసారైనా తలుపు తడుతుందట! అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆ అదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించాలట! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! ఒకప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేసిన ఓ ఫోటో నాన్-ఫంగబుల్ టోకెన్ (NFT) ద్వారా తాజాగా జరిగిన వేలం ఏకంగా రూ. 3.7 కోట్లకు అమ్ముడైంది. అసలు ఇంతకీ ఆ ఫొటోలో ఏముంది.? ఎందుకు ఇంత ధర పలికిందో ఇప్పుడు తెలుసుకుందాం..

2005వ సంవత్సరంలో జో రోత్ అనే 4 ఏళ్ల చిన్నారి ఓ కాలిపోతున్న భవనం ముందు ఫోటో దిగింది. ఈ ఫొటోలో నవ్వుతూ దెయ్యంగా ఉండగా.. తన తండ్రి దేవ్ రోత్ ఫోటోను క్లిక్ మనిపించాడు. ఈ వైరల్ ఫోటో తాజాగా ఆక్షన్ లోకి రాగా.. 5 లక్షల డాలర్లకు(రూ. 3.7 కోట్లకు) అమ్ముడైంది. ఇటీవల జేపీజీ మ్యాగజైన్ నిర్వహించిన ‘ఎమోషనల్ క్యాప్చర్’ అనే కంటెస్ట్.. ఆ తండ్రీకూతుళ్ల జీవితాలను మార్చేసింది. ఈ పోటీకి దేవ్ రోత్ తన కూతురు దిగిన ఫోటోను పంపించగా.. అది కాస్తా కాసుల వర్షం కురిపించింది. కాగా, 2005 నుంచి ఈ ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్లకు ఫేవరెట్ గా నిలవడమే కాకుండా.. జో రోత్ ‘డిజాస్టర్ గర్ల్’గా ఫేమస్ అయింది.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

 కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!