Snake Festival: ఓరీ దేవుడో.. ఇదెక్కడి ప్రాణాంతక జాతర బాబోయ్.. విషపూరిత పాముల్ని మెడలో వేసుకుని విన్యాసాలు..

నాగుపాము, కరైట్ వంటి విష సర్పాలను కొందరు మెడలో వేలాడదీసుకుంటారు. మరికొందరు వాటిని బుట్టల్లో చుట్టుకుని వస్తారు. ఇంకొందరు విష సర్పాలను నోటిలో పట్టుకుని వివిధ విన్యాసాలు చేస్తారు. వేడుకంతా పూర్తైన తరువాత ఈ పాములను తిరిగి అడవిలో వదిలివేస్తారు. ఈ పూజ సమయంలో కోరుకునే కోరికలు నెరవేరుతాయని స్థానికులు నమ్ముతారు. ఈ ఆచారం..

Snake Festival: ఓరీ దేవుడో.. ఇదెక్కడి ప్రాణాంతక జాతర బాబోయ్.. విషపూరిత పాముల్ని మెడలో వేసుకుని విన్యాసాలు..
Snake Festival

Updated on: Jul 19, 2025 | 4:10 PM

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ పాముల జాతర జరగుతుంది. జిల్లాలోని విభూతిపూర్‌లోని సింధియా ఘాట్‌ వద్ద పాముల ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవంలో పాల్గొనే ప్రజలంతా విషపూరితమైన పాములను తాళ్లలా మెడలో వేలాడాదీసుకుంటారు. అంతేకాదు..పాములని నోటిలో కూడా పెట్టుకుని పాములతో విన్యాసాలు చేస్తారు. గండక్ నదిలో స్నానం చేసి భగవతి దేవిని పూజిస్తారు. వేలాది మంది ప్రజలు ఈ జాతరకు పాములతో వస్తారు. వాటితో విన్యాసాలు చేస్తారు. దీని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సింధియా ఘాట్ వద్ద జరిగే ఈ జాతర సమష్టిపుర నగరం నుండి 23 కి.మీ దూరంలో ఉన్న బుధి గండక్ నది ఒడ్డున జరుగుతుంది. ఈ జాతర సింధియా బజార్‌లోని మా భగవతి ఆలయంలో పూజతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భక్తులు పాములను బుట్టల్లో మోసుకెళ్లి సింధియా ఘాట్ చేరుకుంటారు. అక్కడ, నదిలో స్నానం చేసి విషహరి మాతను, నాగ దేవతను పూజిస్తారు. అనంతరం నాగుపాము, కరైట్ వంటి విష సర్పాలను కొందరు మెడలో వేలాడదీసుకుంటారు. మరికొందరు వాటిని బుట్టల్లో చుట్టుకుని వస్తారు. ఇంకొందరు విష సర్పాలను నోటిలో పట్టుకుని వివిధ విన్యాసాలు చేస్తారు. వేడుకంతా పూర్తైన తరువాత ఈ పాములను తిరిగి అడవిలో వదిలివేస్తారు. ఈ పూజ సమయంలో కోరుకునే కోరికలు నెరవేరుతాయని స్థానికులు నమ్ముతారు. ఈ ఆచారం ముఖ్యంగా కుటుంబ వృద్ధికి, ఆనందం, శ్రేయస్సు కోసం నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ జాతర మిథిలా ప్రాంతం సాంస్కృతిక, మతపరమైన వారసత్వంలో భాగం. ఇది దాదాపు 300 సంవత్సరాల నాటిది. ఈ సంప్రదాయం సర్ప దేవుడు, మా విషహరిపై విశ్వాసానికి ప్రతీక అని స్థానికులు చెబుతారు. ముఖ్యంగా మహిళలు ఈ జాతరలో పాల్గొని కుటుంబం ఆనందం, శాంతి కోసం ఆశీస్సులు కోరుకుంటారు. పూజానంతరం వారు ప్రసాదం అందిస్తారు. సమష్టిపురతో పాటు, ఖగారియా, సహర్సా, బెగుసరాయ్, ముజఫర్‌పూర్ వంటి జిల్లాల నుండి వేలాది మంది ఈ జాతరకు వస్తారు. జాతర వద్ద ఒక కిలోమీటరు పొడవునా క్యూలు కనిపిస్తాయి. ఇందులో, పిల్లల నుండి వృద్ధుల వరకు మెడలో పాములను వేలాడదీసుకుని కనిపిస్తారు. నాగ పంచమి రోజున పాములను ముందుగానే పట్టుకుని బుట్టల్లో ఉంచి పూజిస్తారని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రత్యేక ఆచారం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారనేది నిజం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..