Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాపం బిడ్డ.. ప్రయోగం ఫెయిల్ అయ్యింది.. వీపు వాచిపోయింది.. మస్త్ కామెడీ వీడియో మీకోసం..

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నిత్యం అనేక ఫన్నీ వీడియోలో నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. వాటిని చూస్తే నవ్వు ఆపుకోలేని పరిస్థితి ఉంటుంది.

Viral Video: పాపం బిడ్డ.. ప్రయోగం ఫెయిల్ అయ్యింది.. వీపు వాచిపోయింది.. మస్త్ కామెడీ వీడియో మీకోసం..
Gym
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 19, 2021 | 3:14 PM

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నిత్యం అనేక ఫన్నీ వీడియోలో నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. వాటిని చూస్తే నవ్వు ఆపుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇంకొన్ని వీడియోలు అయితే, షాకింగ్‌గానూ ఉంటాయి. ఇదిలాఉంటే.. కరోనా ఎఫెక్ట్‌తో గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోనూ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. హెల్తీగా, ఫిట్‌గా ఉంటే ఎలాంటి సమస్యా ఉండదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కసరత్తులు, వగైరా చేస్తున్నారు. అయితే, సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాయామం చేయడానికి జిమ్ సదుపాయాలు అందుబాటులో ఉండవు. దాంతో చాలా మంది తెలివిగా ప్రయోగాలు చేస్తుంటారు. జిమ్ సెంటర్‌లో ఉండే పరికరాల మాదిరిగానే.. ఇళ్లలో పరికరాలను తయారు చేసి వినియోగిస్తుంటారు. వాటితో వ్యాయామం చేస్తుంటారు. ఇక్కడ కూడా ఓ యువకుడు అలాంటి ప్రయోగమే చేశాడు. అయితే, ఆ ప్రయోగం కాస్తా ఫెయిల్ అయ్యి.. వీపు చింతపండు అయ్యింది. ఆ దెబ్బకు విలవిల్లాడిపోయాడు బిడ్డ. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అయితే, యువకుడికి సంబంధించిన ఈ వీడియో నవ్వు తెప్పిస్తుంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ యువకుడు జిమ్ సెంటర్‌లో ఉండే పరికరాల మాదిరి.. ఇంట్లోనే సరికొత్తగా ఏర్పాటు చేశాడు. ఓ టైర్ రబ్బర్(ట్యూబ్)ని కట్ చేసి బ్యాక్ పుషప్స్ కోసం వినియోగించే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా.. ఆ యువకుడు రబ్బర్‌ను గోడకు ఫిక్స్ చేశాడు. దానికి ఉపయోగించి చేతులతో వర్కౌట్ చేయడం ప్రారంభించాడు. కాసేపు బాగానే చేశాడు. అలా చేస్తున్న క్రమంలోనే రబ్బర్ బాగా సాగింది. అలా గోడకు ఫిక్స్ చేసిన రబ్బర్ తెగి.. అతని వీపునకు బలంగా తగిలిగింది. ఆ బెబ్బకు యువకుడు కళ్లు బైర్లు కమ్మాయి.. ఆ దెబ్బను తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. అయితే, యువకుడు వర్కౌట్స్ చేస్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఏమిరా తమ్మీ.. పాపం ఎంత పని అయిపాయే అంటూ జాలి ప్రదర్శిస్తున్నారు. మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. end_punjab_420 పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయగా.. అదికాస్తా సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

View this post on Instagram

A post shared by End punjab (@end_punjab_420)

Also read:

IPL 2021 MI vs CSK: ఐపీఎల్ సందడి షురూ.. తొలిరోజు రోహిత్‌తో తలపడనున్న ధోని.. బలాలు, బలహీనతలు ప్రివ్యూలో చూద్దాం!

Tirumala: తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా చక్రస్నానం.. పాలు,పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చంద‌నంతో అభిషేకం

IPL 2021: ధోని 8 సిక్సర్లు కొట్టి ముంబైని హెచ్చరించాడు..! వీడియో చూస్తే అదిరిపోతారంతే..?

వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు మోస్తరు వర్షాలు..
వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు మోస్తరు వర్షాలు..
కొంటెతనంతో ఆకట్టుకుంటున్న కాయదు..ఈ అమ్మడు రేర్ ఫొటోస్ చూశారా!
కొంటెతనంతో ఆకట్టుకుంటున్న కాయదు..ఈ అమ్మడు రేర్ ఫొటోస్ చూశారా!
Viral Video: అంతరిక్ష కేంద్రంలో జపాన్‌ వ్యోమగామి బేస్‌బాల్‌ గేమ్‌
Viral Video: అంతరిక్ష కేంద్రంలో జపాన్‌ వ్యోమగామి బేస్‌బాల్‌ గేమ్‌
30శాతం కమీషన్లు..! అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ భట్టి విక్రమార్క..
30శాతం కమీషన్లు..! అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ భట్టి విక్రమార్క..
పోటుగాడురా పంత్.! డకౌట్‌లోనూ డబ్బుల సంపాదనే..
పోటుగాడురా పంత్.! డకౌట్‌లోనూ డబ్బుల సంపాదనే..
ఓరి దేవుడా.! మనుషుల్లా మారిన పెంగ్విన్లు ఏం చేస్తున్నాయో తెలిస్తే
ఓరి దేవుడా.! మనుషుల్లా మారిన పెంగ్విన్లు ఏం చేస్తున్నాయో తెలిస్తే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగే వారికి అలర్ట్‌..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగే వారికి అలర్ట్‌..
డైరెక్ట్‌గా రోహిత్‌పై సిరాజ్‌ కామెంట్స్‌! ఏమన్నాడంటే..?
డైరెక్ట్‌గా రోహిత్‌పై సిరాజ్‌ కామెంట్స్‌! ఏమన్నాడంటే..?
రాజస్థాన్‌ టోంక్ ఫామిలీ టూర్ కోసం బెస్ట్.. ఏమి చూడొచ్చు అంటే.?
రాజస్థాన్‌ టోంక్ ఫామిలీ టూర్ కోసం బెస్ట్.. ఏమి చూడొచ్చు అంటే.?
వేసవికి విమానయాన ప్రరిశ్రమ భారీ ప్లాన్.. విమాన సర్వీసుల పెంపు
వేసవికి విమానయాన ప్రరిశ్రమ భారీ ప్లాన్.. విమాన సర్వీసుల పెంపు