Shahrukh khan: పఠాన్‌ మూవీ పాటకు మహిళా ప్రొఫెసర్ల అదిరిపోయే డ్యాన్స్‌.. షారూఖ్‌ రియాక్షన్‌ ఏంటంటే.

చాలా రోజుల తర్వాత పఠాన్‌ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు నటుడు షారుఖ్‌ ఖాన్‌. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో షారూఖ్‌ మళ్లీ సక్సెస్ ట్రాక్‌ తొక్కారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సుమాని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం...

Shahrukh khan: పఠాన్‌ మూవీ పాటకు మహిళా ప్రొఫెసర్ల అదిరిపోయే డ్యాన్స్‌.. షారూఖ్‌ రియాక్షన్‌ ఏంటంటే.
Shahrukh Khan

Updated on: Feb 22, 2023 | 7:52 AM

చాలా రోజుల తర్వాత పఠాన్‌ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు నటుడు షారుఖ్‌ ఖాన్‌. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో షారూఖ్‌ మళ్లీ సక్సెస్ ట్రాక్‌ తొక్కారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సుమాని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఏకంగా రూ. వెయ్యి కోట్టు రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో.. సోషల్‌ మీడియాలోనూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు పఠాన్‌ మూవీ సాంగ్‌కు కాలు కదిపారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని జేఎమ్ కాలేజ్ కామర్స్ ప్రొఫెసర్లు క్యాంపస్‌లో జరిగిన ఓ కల్చరల్ ప్రొగ్రాంలో ప్రొఫెసర్లు డ్యా్న్స్‌లతో అదరగొట్టారు. పఠాన్‌ మూవీలోని ‘జూమె జో పఠాన్’ సాంగ్‌కు కాలు కదిపి అదరగొట్టారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ప్రొఫెసర్ల డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.

ఇదిలా ఉంటే ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి షారుఖ్‌ కంట్లో పడింది. దీంతో ఈ వీడియోపై షారూఖ్‌ స్పందించారు. ప్రొఫెసర్ల డ్యాన్స్‌ వీడియోను రీట్వీట్ చేసిన షారూఖ్‌.. ‘మనకు విద్య నేర్పిస్తూ.. మనతో సరదాగా గడిపే టీచర్లు, ప్రొఫెసర్లు దొరకడం చాలా అదృష్టం. వీరు ఎడ్యుకేషనల్ రాక్ స్టార్స్’ అంటూ రాసుకొచ్చారు షారుఖ్‌. దీంతో షారూఖ్‌ చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే షారూఖ్ ఖాన్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..