Viral Video: హోంవర్క్ చేయలేదన్న కారణంతో కూతురి చేతులను తాళ్లతో ఎండలో బంధించిన కసాయి తల్లి
Viral Video: పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినా దారుణంగా శిక్షిస్తుంటారు కొందరు తల్లులు. హోంవర్క్ చేయలేదని ఓ మహిళ చిన్నారిని కట్టేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ,..
Viral Video: పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినా దారుణంగా శిక్షిస్తుంటారు కొందరు తల్లులు. హోంవర్క్ చేయలేదని ఓ మహిళ తన కూతురిని తాళ్లతో కట్టేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. స్కూల్ హోం వర్క్ చేయనందుకు తల్లి ఆ చిన్నారిని బంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమైన పలు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని కరవాల్నగర్ ప్రాంతానికి చెందిందని పోలీసులు గుర్తించారు.
After a video of a girl child tied up on the roof of a house surfaced on social media, all possible efforts were made by Delhi Police to ascertain her identity and circumstances. The family of the child has been identified and appropriate action initiated.#DelhiPoliceCares
— Delhi Police (@DelhiPolice) June 8, 2022
పాప చేతులు, కాళ్లకు తాడుతో కట్టేసి భవనం పైకప్పుపై పడుకోబెట్టింది. చేతులను విడిపించుకునేందుకు ఆ చిన్నారి నానా అవస్థలు పడుతూ ప్రయత్నాలు చేసింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి