ఎన్నో కఠిన చట్టాలు, శిక్షలు ఉన్నప్పటికీ.. నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మెట్రోపాలిటిన్ నగరాల్లో అయితే.. ఇక చెప్పాల్సిన పనేలేదు.. అక్కడ నేరాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.. పెద్ద పెద్ద నగరాల్లో పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, మొబైల్స్ దొంగతనం కేసులు రోజుకు వందలాది కేసులు నమోదవుతుంటాయి.. పోలీసులు పట్టుకుంటున్నప్పటికీ.. దొంగలు మాత్రం వేషాలు మారుస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటారు.. కానీ.. అలాంటి వారికి పోలీసులు దిమ్మతిరిగేలా సమాధానం చెబుతుంటారు. తాజాగా.. ఓ యువకుడు ద్విచక్రవాహనదారుడికి సాయం చేస్తానని వచ్చి పర్సు దొంగతనం చేశాడు.. అది చూసిన కానిస్టేబుల్ ఆగమేఘాలమీద దూసుకొచ్చి దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ దొంగ.. బైకర్ వాలెట్‌ను దొంగిలించే క్రమంలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సచిన్ పట్టుకున్నాడు. వివరాల ప్రకారం.. ఓ ద్విచక్రవాహన దారుడు తన వాహనం స్టార్టింగ్ లో ఇబ్బంది పడుతున్నాడు.. ఈ క్రమంలో ఓ యువకుడు వాహనాన్ని స్టార్ట్ చేయడానికి సహాయం చేస్తాననే నెపంతో బైకర్ వాలెట్‌ను దొంగిలించడానికి ప్రయత్నించాడు. అయితే, కానిస్టేబుల్ సచిన్ అనుమానాస్పద ప్రవర్తనను గమనించి అక్కడి వెంటనే పరుగులు తీశాడు.. దొంగతనం చేద్దామనుకునేలోపే కానిస్టేబుల్ దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించాడు.
थाना सदर बाज़ार क्षेत्र में गश्त ड्यूटी के दौरान #दिल्लीपुलिस के कांस्टेबल सचिन ने संज्ञेय अपराध की संभावना को देखते हुए शख़्स को दौड़कर पकड़ा और गिरफ्तार किया।@DcpNorthDelhi pic.twitter.com/Pja8Hl8zum
— Delhi Police (@DelhiPolice) May 8, 2024
ఈ దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో షేర్ చేశారు.. ”పోలీస్ స్టేషన్ సదర్ బజార్ ప్రాంతంలో పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా, కానిస్టేబుల్ సచిన్ ముందుగానే అనుమానించి, పరిగెత్తుకుంటూ వెళ్లి దొంగను పట్టుకుని అరెస్టు చేశారు,” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
అయితే ఈ ఘటన జరిగిన తేదీ, ప్రదేశం గురించి వెల్లడించలేదు.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వేలాది మంది చూడటంతోపాటు.. పలు కామెంట్లు చేస్తున్నారు. సూపర్ పోలీస్ అంటూ కానిస్టేబుల్ ను ప్రశంసిస్తున్నారు. ”గుడ్ జాబ్”.. కానిస్టేబుల్ ధైర్యసాహసాలకు అభినందనలు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందరూ ఇలానే ఉంటే.. నేరాలు లాంటివే జరగవంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..