Golgappa Machine: పానీ పూరీ అమ్ముతున్న రోబో.. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఢిల్లీకి చెందిన వ్యక్తి..

|

Nov 27, 2021 | 3:04 PM

Golgappa Machine: గోల్ గప్ప, పానీపూరి, పేరు ఏదైనా కావొచ్చు.. కానీ ఈ స్నాక్ ఐటెంకు దేశ వ్యాప్తంగా ప్రేమికులున్నారు.  ఉత్తర భారత దేశం నుంచి దక్షిణాదికి..

Golgappa Machine: పానీ పూరీ అమ్ముతున్న రోబో.. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఢిల్లీకి చెందిన వ్యక్తి..
Golgappa Machine
Follow us on

Golgappa Machine: గోల్ గప్ప, పానీపూరి, పేరు ఏదైనా కావొచ్చు.. కానీ ఈ స్నాక్ ఐటెంకు దేశ వ్యాప్తంగా ప్రేమికులున్నారు.  ఉత్తర భారత దేశం నుంచి దక్షిణాదికి అడుగుపెట్టిన ఈ స్ట్రీట్ ఫుడ్ ని ఇష్టపడని ఉండరు. ముఖ్యంగా అమ్మాయిలు పానీ పూరీకి పెద్ద ప్రేమికులని చెప్పవచ్చు. అయితే  ఓ బండి మీద చిరు వ్యాపారి.. పూరీని అమ్మడం ఇప్పటి వరకూ అందరి తెలిసిందే. అయితే తాజాగా ఇష్టమైన పానీపూరీని చిరు వ్యాపారి బదులు .. రోబో అమ్ముతుంటే.. అసలు ఇది ఊహకు కూడా అందని విషయం కదా.. కానీ నిజంగా పానీ పురీ భయ్యా స్థానంలో రోబో గోల్ గప్పని అమ్ముతుంది. ఇది పూర్తిగా భారత దేశంలో తయారు చేయబడిన రోబో. ఢిల్లీ కి చెందిన ఓ వ్యక్తి కాంటాక్ట్‌లెస్ గోల్గప్పా మెషీన్‌ని డిజైన్ చేశాడు. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయబడిందని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

ఫుడ్ బ్లాగర్ విశాల్ యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఢిల్లీలోని ఒక వీధిలో వేడింగ్ మెషిన్ తో పాటు.. దానిని తయారు చేసిన గోవింద్ గురించి తెలుపుతుంది.  రోబోటిక్స్ ఇంజనీర్గోఅయిన గోవింద్ ఓ వైపు తన విధులను నిర్వహిస్తూనే.. మరోవైపు పూర్తిగా  స్వదేశీ  క్లౌడ్ టెక్నాలజీతో రోబో తయారు చేసినట్లు చెప్పారు. పానీ పూరీ తినాలనుకునే కస్టమర్ రూ. 20 ధరని మెషీన్‌లోదగ్గర ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి, మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వెంటనే మెషిన్ నుంచి మీరు చెల్లించిన డబ్బులకు సరిపడా గోల్గప్పస్ బాక్స్‌ను బయటకు వస్తుంది. అంతేకాదు పానీ పూరీకి కావలసిన మిరియాలు పుదీనా నీరు కూడా అక్కడ చూపించిన రుచులలో గ్లాసు పెట్టిన వెంటనే వస్తుంది.  ప్రస్తుతం ఈ ఆటోమేటిక్ గోల్గప్పా వెండింగ్ మెషీన్ నెటిజన్లను ఆకర్షిస్తుంది.

నార్త్ ఇండియా నుంచి అడుగు పెట్టిన గోల్ గొప్పకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. కర కరలాడే చిన్నపాటి పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. ఇవి ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి. ఈ పానీ పూరీకి అమ్మాయిలైతే స్పెషల్ ప్రేమికులని చెప్పవచ్చు..

Also Read:  టమాటా లేకుండా రుచికరమైన వంట.. హైదరాబాదీ నవాబీ పనీర్ గ్రేవీ కర్రీ తయారీ..