Liquor Shops Offer: ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం.. మద్యం షాపుల బంపర్ ఆఫర్..!

|

Feb 15, 2022 | 12:15 PM

Liquor Shops Offer: సినిమా థియేటర్లలో టికెట్ల కోసం జనాలు క్యూ కట్టడం చూసుంటారు. పౌరసరఫరాల పంపిణీ దుకాణాల వద్ద బారులు తీరడం చూసుంటారు.

Liquor Shops Offer: ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం.. మద్యం షాపుల బంపర్ ఆఫర్..!
Follow us on

Liquor Shops Offer: సినిమా థియేటర్లలో టికెట్ల కోసం జనాలు క్యూ కట్టడం చూసుంటారు. పౌరసరఫరాల పంపిణీ దుకాణాల వద్ద బారులు తీరడం చూసుంటారు. నోట్ల రద్దు సమయంలో ఏటీఎం కేంద్రాల వద్ద జనాలు పడిగాపులు గాయడం కూడా చూసుంటారు. మరి వైన్ షాపుల వద్ద ప్రజలు బారులుతీరడం ఎప్పుడైనా చూశారా? మహా అయితే, కొద్ది మంది క్యూలైన్లలో వేచి ఉండటం చూసుంటారు కానీ, వందలాది మంది మద్యం షాపుల ముందు పడిగాపులు కాయడం చూసుండరు. అవును.. తెల్లవారడమే ఆలస్యం అన్నట్లుగా అక్కడ జనాలు మద్యం దుకాణాల మందు భారీ స్థాయిలో క్యూ కట్టారు. మద్యం కొనుగోలు కోసం ఎగబడతున్నారు. ఇది ఎక్కడో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే, మద్యపాన నిషేధమూ లేదు, మద్యం షాపుల బందూ కాదు. మరి ఎందుకు ఇలా వందలాది మంది మద్యం దుకాణాల ముందు బారులు తీరారో తెలిస్తే షాక్ అవుతారు.

ఢిల్లీలో ఏ వైన్ షాపు ఎదుట చూసిన భారీ సంఖ్యలో మద్య కొనుగోలుదారులు పడిగాపులు కాస్తున్నారు. వైన్ షాపు యాజమన్యాలు ప్రకటించిన ఆఫర్లే ఇందుకు కారణం. మద్యం బాటిళ్లపై భారీ తగ్గింపును ఇస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ఉచితాలు ప్రకటించేశాయి. ఢిల్లీలోని జహంగీర్‌పురి, షాహదారా, మయూర్ విహార్‌తో సహా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై 35 శాతం వరకు తగ్గింపు ఆఫర్‌ ప్రకటించాయి. మరికొన్ని చోట్ల ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ప్రకటించేశారు. ఆ ప్రత్యేక ఆఫర్లతో.. జనాలు వైన్ షాపులకు బారులు తీరారు. మద్యం కొనుగోళ్లకు ఎగబడుతున్నారు.

ఢిల్లీ ప్రభుత్వ నియమాల ప్రకారం.. కొత్త ఆర్థిక సంవత్సరంలో వైన్ షాపులకు లైసెన్స్‌లు పునరుద్ధరిస్తారు. అంటే మార్చి చివరి నాటికి మద్యం దుకాణాలు తమ స్టాక్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కారణంగానే అమ్ముడుపోని మద్యం బ్రాండ్లపై ఆఫర్లు ప్రకటించినట్లు అక్కడి వైన్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో లైసెన్స్ గడువు ముగుస్తుండటం, షాపుల్లో మద్యం స్టాక్ ఉండటంతో ఆ స్టాక్‌నంతా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు వ్యాపారులు. ఇందులో భాగంగానే రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధర తగ్గింపు ప్రకటించగా.. మరికొన్ని బ్రాండ్లపై ఒకటి కొంటే మరొకటి ఉచితం అని ప్రకటించారు. ఈ ఆఫర్ల నేపథ్యంలో మందుబాబులు వైన్ షాపుల వద్దకు పోటెత్తుతున్నారు.

కాగా, మద్యం దుకాణాలలో కరోనా నిబంధనల అమలు, పెళ్లిళ్ల సీజన్, ఇతర కారణాలతో ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో.. వైన్ షాపుల వద్ద క్యూలైన్లు పెరిగాయని ఢిల్లీకి ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆఫర్ల కారణంగా ప్రజలు పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తున్నట్లు పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఇక హర్యానా, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు పట్టణాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాల్లో ఈ ఆఫర్లు ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీ గతేడాది నవంబర్ నెలలో అమల్లోకి వచ్చింది.

Wine Shops Offer

Also read:

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఆఫ్‌ లైన్‌లో సర్వ దర్శనం టికెట్స్‌ జారీ..

Hyderabad: రాత్రి బయటకు వెళ్లిన యువతి.. తెల్లారి మామిడితోటలో శవమై తేలింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Medaram Jatara 2022: నేడు మేడారం మహాజాతరకు బయలుదేరనున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు..