Kids first day in school: చిన్నతనంలో పాఠశాలకు వెళ్లే రోజులు గుర్తొస్తే చాలు తెగ నవ్వొస్తుంది.. బడికి పంపేందుకు తల్లిదండ్రులు కష్టపడుతుంటే.. కొంతమంది మాత్రం వెళ్లమంటూ తెగ ఏడుస్తుంటారు.. ‘‘నువ్వు ఏడ్చినా.. ఇంకేం చేసినా.. బడికి వెళ్లాల్సిందేనంటూ’’ కాళ్లు, చేతులు పట్టుకొని ఈడ్చుకుంటూ బడికి తీసుకెళ్లేవారిని మనం చాలాసార్లు చూశాం. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు బడికి వెళ్లమంటూ మారం చేస్తున్న వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. బడికి వెళ్లనంటూ వారి పిల్లలు ఏడ్చారో.. లేక ఇంకా ఏమైనా ప్రణాళికలు రచించారో తెలియదు కానీ.. ఆ కుటుంబసభ్యులు పిల్లలను బడిలో దింపేందుకు కాస్త క్రియేటివిటీగా ఆలోచించారు. బడిలో పిల్లలను దింపేందుకు ఏకంగా బ్యాండ్ బాజానే ఏర్పాటు చేశారు. మేళతాళాల మధ్య పిల్లలను బడికి పంపించారు. తాజాగా.. తల్లిదండ్రులు తమ పిల్లలను బ్యాండ్ బాజా మధ్య బడికి సాగనంపుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ @ikaveri షేర్ చేశారు. ఆమె క్యాప్షన్‌లో ఇలా రాశారు.. ఢిల్లీలో పిల్లలను బడికి పంపుతుతున్న విషయం వేరేగా ఉంది. ఓ కుటుంబం.. పిల్లవాడు స్కూల్‌కి వెళ్లే మొదటి రోజు కాబట్టి ఇలా బ్యాండ్ బాజాతో వచ్చింది. ఢిల్లీలోని ధౌలా కువాన్‌లోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో ఈ ప్రత్యేకమైన సన్నివేశం కనిపించిందంటూ ట్వీట్‌లో రాశారు. ఈ వీడియోలో.. పాఠశాల గేటు వద్ద ఒక కుటుంబం ఉండటాన్ని చూడవచ్చు. బ్యాండ్ వాయిస్తుండగా.. తల్లిదండ్రులు పిల్లల చేయి పట్టుకుని డ్యాన్స్ చేయిస్తున్నారు. చుట్టూ ఉన్న వ్యక్తులు ఈ అరుదైన క్షణాన్ని కెమెరాలో బంధిస్తున్నారు. కాగా.. ఈ వీడియో వైరల్ అయిన అనంతరం సోషల్ మీడియాలో పలు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియో..
#Delhi is so extra. This family brought a band to send off their child on his first day of school. Springdales, Dhaula Kuan. pic.twitter.com/fHwyqEysc2
— Kaveri 🇮🇳 (@ikaveri) November 13, 2021
మా రోజుల్లో అయితే.. కొట్టి మరి స్కూలుకు పంపేవారని పేర్కొంటున్నారు. బహుశా ఢిల్లీలో కాబట్టి ఇలా జరిగిందని.. అదే మా దగ్గర అయితే.. పరిస్థితి వేరే మాదిరిగా ఉండేదని పేర్కొంటున్నారు. దీంతోపాటు.. పలు ఫన్నీ కామెంట్లని.. మీమ్స్ ను షేర్ చేస్తున్నారు.
Also Read: