Trending News: ఈ చోలే భాతురే తింటే.. వెయిట్ లాస్ పక్కా.. అదిరే ఉపాయం..

ఆహార ప్రియులకు ఇష్టమైన స్నాక్స్‌లో చోలే భాతురే కూడా ఒకటి. చోలే భాతురే అనేది ఇప్పటి రెసిపీ కాదు. పూర్వం నుంచి ఈ రెసిపీని తింటూ ఉంటారు. ముఖ్యంగా భారత రాజధాని అయిన ఢిల్లీలో.. చోలే భాతురే చాలా ఫేమస్. ఈ వంటకానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది దీన్ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చోలే భాతురేని కూడా ఎన్నో వెరైటీలుగా చేస్తారు. స్నాక్స్‌లో పానీ పూరీ తర్వాత చోలే భాతురేనే అందరికీ ఇష్టం. పూరీతో తినే ఈ వంటకం ఎంతో మంది ఆహార..

Trending News: ఈ చోలే భాతురే తింటే.. వెయిట్ లాస్ పక్కా.. అదిరే ఉపాయం..
Trending News

Updated on: May 27, 2024 | 8:07 PM

ఆహార ప్రియులకు ఇష్టమైన స్నాక్స్‌లో చోలే భాతురే కూడా ఒకటి. చోలే భాతురే అనేది ఇప్పటి రెసిపీ కాదు. పూర్వం నుంచి ఈ రెసిపీని తింటూ ఉంటారు. ముఖ్యంగా భారత రాజధాని అయిన ఢిల్లీలో.. చోలే భాతురే చాలా ఫేమస్. ఈ వంటకానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది దీన్ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చోలే భాతురేని కూడా ఎన్నో వెరైటీలుగా చేస్తారు. స్నాక్స్‌లో పానీ పూరీ తర్వాత చోలే భాతురేనే అందరికీ ఇష్టం. పూరీతో తినే ఈ వంటకం ఎంతో మంది ఆహార ప్రియులను ఆకట్టుకుంటుంది. చోలే భాతురే ఫొటో చూడాగానే ఎవరి మనసైనా లాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది అంత రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా.

అదేంటి? చోలే భాతురే తింటే లావు అవుతారు కదా అని మీరు అనుకోవచ్చు. చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ సరిగ్గా తింటే ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇదే ట్యాగ్ లైన్‌తో ఢిల్లీ లోని ఓ రెస్టారెంట్ అందరి మనసులను ఆకట్టుకుంటుంది. మా చోలే భాతురే తినండి.. హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి అని ప్రకటన ఇచ్చింది. దీంతో చాలా మంది చోలే భాతురే తినడానికి క్యూ లైన్ కడుతున్నారు. ఈ చోలే భాతురేలో ఏం కలుపుతున్నారు? ఎలా వండుతున్నారని అందరిలో ఆసక్తి మొదలైంది.

ఢిల్లీలోని గోపాల్ జీ అనే ఓ హోటల్.. చోలే భాతురే తినండి.. వెయిట్ లాస్ అవ్వడి అని ప్రకటన ఇచ్చాడు. ఈ రెసిపీ తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చని వెల్లడించారు. దీంతో ఈ ఐటెమ్ తినేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఆదిత్య వోరా అనే వ్యక్తి తన x ఖాతా నుంచి ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్.. నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఆ ఫొటోలు మీరు కూడా చూసేయండి.