ఏడు నెలల చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి.. స్కానింగ్‌ రిపోర్ట్‌లో షాకింగ్‌ సీన్‌..! ఏం జరిగిదంటే..

|

Aug 21, 2024 | 4:36 PM

కాగా, చిన్నారి టెస్ట్‌ రిపోర్ట్స్‌ పరీక్షించిన డాక్టర్స్‌ వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రుల అనుమతితో చిన్నారికి సర్జరీ పూర్తి చేశారు. వైద్య భాషలో ఇలాంటి కేసులను ఫీటస్ ఇన్ ఫీటూ అంటారని వివరించారు. కొన్ని సందర్భాల్లో తల్లి కడుపులో పెరుగుతున్న పిండం లోపల మరొక పిండం ఏర్పడుతుందని చెప్పారు.

ఏడు నెలల చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి.. స్కానింగ్‌ రిపోర్ట్‌లో షాకింగ్‌ సీన్‌..! ఏం జరిగిదంటే..
New Born Baby
Follow us on

ఉత్తరాఖండ్‌లో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడు నెలల చిన్నారి కడుపులో మరో పిండం పెరుగుతున్నట్టుగా గుర్తించారు వైద్యులు. వెంటనే చిన్నారికి ఆపరేషన్‌ నిర్వహించి ఆ పసికందు కడుపులోంచి పిండాన్ని తొలగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం క్షేమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తల్లి కడుపులో పెరుగుతున్న పిండం లోపల మరో పిండం ఏర్పడడం వల్ల ఇలాంటి కేసులు తెరపైకి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలల నవజాత శిశువుకు క్రమంగా కడుపు ఉబ్బటం కనిపించింది. అంతేకాదు.. చిన్నారి తరుచు కడుపునొప్పితో బాధ పడుతు ఉండేది. గమనించిన తల్లిదండ్రులు..చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు..పొట్టకు సీటీ స్కాన్ చేశారు. రిపోర్టు చూసిన డాక్టర్స్‌ ఒక్కసారిగా షాకయ్యారు. చిన్నారి కడుపులో మరో పిండం పెరుగుతోందని గుర్తించారు. ఈ విషయాన్నీ చిన్నారి కుటుంబ సభ్యులకు చెప్పగానే వాళ్లు కూడా నిర్ఘంతాపోయారు. ఇదేలా సాధ్యమో తెలియక వారంతా ఆందోళనకు గురయ్యారు. తొలుత చిన్నారికి కడుపులో కణితి ఉందని అంతా భావించారు.

కాగా, చిన్నారి టెస్ట్‌ రిపోర్ట్స్‌ పరీక్షించిన డాక్టర్స్‌ వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రుల అనుమతితో చిన్నారికి సర్జరీ పూర్తి చేశారు. వైద్య భాషలో ఇలాంటి కేసులను ఫీటస్ ఇన్ ఫీటూ అంటారని వివరించారు. కొన్ని సందర్భాల్లో తల్లి కడుపులో పెరుగుతున్న పిండం లోపల మరొక పిండం ఏర్పడుతుందని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 200లకు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ చిన్నారి విషయంలో కూడా అదే జరిగిందని చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదుడగా జరుగుతాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..