తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట అన్న సామెత పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుంది. తాను అభివృద్ధి చెందదు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ ని చూస్తే ఓర్వలేదు. అందుకనే ఏదోక విధంగా మన దేశాన్ని ఇబ్బంది పెడుతూ దేశంలో కల్లోలం సృష్టించాలని కోరుకుంటుంది. అందుకనే భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఎప్పుడూ ఏదోక గందరగోళాన్ని సృష్టిస్తోంది. భారత దేశంలో చొరబడేందుకు దొంగ వేషాలు వేస్తుంది. భారత్ సైన్యం ఎప్పుడూ సరిహద్దు దగ్గర కంటిమీద కునుకు లేకుండా కావాలా కాస్తారు. పాక్ చర్యలను సమర్ధవంతంగా తిప్పికొడుతూ పాక్ ఆర్మీకి జలక్ ఇస్తారు. అందుకే భారత్, పాక్ ల మధ్య కాల్పులు, చొరబాట్లకు సంబంధించిన గొడవలు జరుగుతూనే ఉంటాయి. పాక్ నియంత్రణ రేఖ దాటి మన దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటారు. అయితే తాము కూడా ఏ మాత్రం తక్కువ కాదు అంటూ సరిహద్దు దగ్గర రెండు జింకలు కయ్యానికి కాలు దువ్వుకున్నాయి.
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో రెండు జింకల ఓ రేంజ్ లో యుద్ధం చేసుకున్నాయి. బోర్డర్ కు అవతల ఒక జింక, ఇవతల మరో జింక తమ కొమ్ములతో కుమ్ముకున్నాయి. ఎక్కడా రెండు జింకలు పోరాడే విషయంలో తగ్గలేదు. ఒకదానిని ఒకరి బలంగా కుమ్ముకున్నాయి. ఇలా ఇవి భీకరంగా తలపడుతున్న సమయంలో ఒక బీఎస్ఎఫ్ ఆఫీసర్ సెల్ ఫోన్ కు పని చెప్పారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరిహద్దు దగ్గర సాధారణ సన్నివేశానికి ఊహించని ట్విస్ట్ అనే క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Kalesh b/w Pakistani hiran (deer)and Indian hiran (deer) ,video captured by BSF officer #indiavspakistan pic.twitter.com/Pm8y20OLod
— TrenDing FBD (@SHIVAMR45419885) July 29, 2024
ఈ ఉల్లాసభరితమైన కొట్లాట నెటిజన్లను ఆకర్షించింది. “ఇండియా వర్సెస్ పాకిస్తాన్” మ్యాచ్ అని హాస్యాస్పదంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఎక్కడా తగ్గెదెలా.. అది ఆర్మీ అయినా భారత క్రీడాకారులైనా సరే చివరకు జింక కూడా పాక్ కు జింకకు గట్టిగానే బుద్ది చెప్పిందిగా అని కామెంట్ చేశారు. భారత్ జోలికి వస్తే నోరులేని జీవాలు సైతం ఊరుకోవంటూ కూడా మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ లో నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..