
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో జరిగిన అనేక వింతలు, విశేషాలు మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్నే చూసేస్తున్నాం. ఎక్కడో జరిగిన వింతలు, విశేషాలు మన ముందుకు వస్తున్నాయి. ఆ వీడియోలు చూస్తే ఇలా కూడా జరుగుతుందా? అని అనిపిస్తుంది. ముఖ్యంగా జంతువులు ఎక్కడో అడవుల్లో ఉంటాయి. కానీ వీటిని కూడా ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. దగ్గరకు వెళ్లి చూడలేక పోయినా.. మన ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా వేటాడే వీడియోలే ఉంటాయి. అంతే కాకుండా రెండు జంతువులు ప్రేమగా ఉండటం కూడా చూసే ఉంటారు.
తాజాగా జంతువులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఎక్కువగా జింకలనే చిరుత, సింహం, హైనాలు వంటివి వేటాడి తింటూ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం జింక ప్రదర్శించిన తెలివి అందరూ ఖచ్చితంగా షాక్‌కి గురవుతారు. ఈ వీడియోలో.. ఓ జింక పడుకుని ఉంటుంది. అక్కడికి వచ్చిన చిరుత చనిపోయిందని తిందాం అనుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన హైనా.. చిరుతని బెదిరించి.. జింకను తిందాం కదా అని దగ్గరకు వెళ్తుంది. జింక చనిపోయింది అనుకుంటుంది. మళ్లీ చిరుతని బెదిరించి జింక దగ్గరకు వచ్చే క్రమంలో.. జింక ఒక్కసారిగా లేచి పరుగులు పెడుతుంది. అది చూసిన చిరుత, హైనాలు ఒక్కసారిగా షాక్‌కి గురవుతాయి. ఏదో ఒక డ్రామా ఆడి తన ప్రాణాలను దక్కించుకుంది జింక.
ఈ వీడియో చూసిన నెటిజన్లు సూపర్ అంటు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. వరుస కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోకు ఇప్పుడు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. ‘వావ్ జింక ఏమన్నా ప్లాన్ వేసిందా’.. ‘జింక దెబ్బకు చిరుత, హైనాలు ఫట్’.. ‘జింక దెబ్బకు చిరుత, హైనాల తిక్క కుదిరింది’.. ‘జింక ఏం ప్లాన్ వేసింది’.. అంటూ ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
Gazelle escapes from Hyena and Cheetah by playing dead pic.twitter.com/Ihmrtm9T6e
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 17, 2024