Viral Video: ఈ బామ్మ స్టెప్పులకు అదుర్స్.. సూపర్ అంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!

|

Aug 29, 2021 | 9:57 AM

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ప్రతీ ఒక్కరూ తమ ప్రతిభను చూపిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువగా డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఈ బామ్మ స్టెప్పులకు అదుర్స్.. సూపర్ అంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!
Dancing Dadi
Follow us on

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో డ్యాన్స్ వీడియోలు అయితే బాగా ప్రాచుర్యం పొందాయి. తమదైన శైలి స్టెప్పులతో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు నెట్టింట తెగ పాపులారిటీని సంపాదిస్తున్నారు. కొన్ని వీడియోలు క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

మాధురీ దీక్షిత్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసిన సినిమా తేజాబ్‌.. అందులో ఏక్‌ దో తీన్‌ పాట ఎంత పాపులరయ్యిందో మనకు తెలుసు.. ఆ పాటలో మాధురి వేసిన స్టెప్స్‌ నెవ్వర్‌ బిఫోర్‌, నెవ్వర్‌ ఆఫ్టర్‌..అలాగే దిల్‌తో పాగల్‌ హై సినిమాలోని ఫేమస్‌ సాంగ్‌ కోయి లడ్కి హై అనే సాంగ్‌లో మాధురీ దీక్షిత్ వేసిన స్టెప్పులకు.. ఈ తరం కుర్రకారు కూడా క్యా బాత్‌ హై అనకమానరు. ఇప్పుడు ఇదే స్టైల్‌లో 62 ఏళ్ల రవి బాల శ‌ర్మ‌ రెండు జడలు వేసుకుని డ్యాన్స్‌ ఇరగదీసింది.

గులాబీ రంగు కుర్తా, తెలుపు ప‌లాజో ధ‌రించి అదిరిపోయే స్టెప్పుల‌తో అచ్చం మాధురి దీక్షిత్‌ను దించేసింది మధుబాల. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే బామ్మ బాల శర్మ గతంలో కూడా పలు సాంగ్స్‌ చేసిన, డ్యాన్స్‌ వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.

ఇవి చదవండి: