Viral Video: మ్యాచ్ గెలిచింది.. తండ్రికి కోపొమొచ్చింది.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కొడుకు టీజింగ్ వీడియో..

సోషల్ మీడియా ప్రపంచంలో మీరు చురుకుగా ఉంటే.. కొన్ని వీడియోలు భయపెడితే.. మరికొన్ని నవ్వులు తెప్పిస్తుంటాయి. అందులో వచ్చే పోస్టింగులు..

Viral Video: మ్యాచ్ గెలిచింది.. తండ్రికి కోపొమొచ్చింది.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కొడుకు టీజింగ్ వీడియో..
Viral Video

Edited By: Sanjay Kasula

Updated on: Jul 12, 2021 | 9:15 AM

సోషల్ మీడియా ప్రపంచంలో మీరు చురుకుగా ఉంటే.. కొన్ని వీడియోలు భయపెడితే.. మరికొన్ని నవ్వులు తెప్పిస్తుంటాయి. అందులోని పోస్టులు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. కొన్ని పోస్టులు నవ్వు తెప్పిస్తుంటాయి.  కానీ, ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వీడియో చూస్తే మీకు షాక్ అవడం మాత్రం ఖాయం. ఫ్యామిలీ అంతా ఒకే చోట కూర్చుని  అర్జెంటీనా వర్సెస్ బ్రెజిల్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారు. బ్రెజిల్  జట్టుపై అర్జెంటీనా గెలిచింది. అప్పటి వరకు అంతా సాఫీగా ఉంది. కాని అదే సమయంలో కొడుకు మాత్రం తన చొక్కా తీసి సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టాడు.. పెద్ద అరుస్తూ.. కేకలు పెడుతూ తండ్రిని టీజ్ చేయడం ఈ వీడియో కనిపిస్తుంది. వీడియోను చూసినప్పుడు.. తండ్రి బ్రెజిల్ జట్టుకు మద్దతు ఇస్తున్నట్లు.. కుమారుడు అర్జెంటీనా జట్టును సపోర్ట్ చేస్తున్నట్లు మనకు అర్థం అవుతుంది.

కొడుకు చేసే అల్లరికి తండ్రికి కోపంకట్టులు తెంచుకుంటుంది. అతను కోపంతో కుర్చీని పైకి లేపుతాడు. తండ్రి కోపాన్ని చూసి కొడుకు అక్కడి నుంచి మరో గదికి పరుగులు పెడతాడు. ఈ ఫన్నీ వీడియోను ట్యూబ్ ఇండియన్ ఇన్‌స్టాగ్రామ్‌  పేజీలో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1 లక్ష 61 వేల మందికి పైగా చూశారు.

ఇవి కూడా చదవండి: Monsoon Rain: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం.. చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడే..

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 465 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా