Telugu News Trending Cycle stunts video was gone viral in social media Telugu Viral News
Video Viral: శక్తిమాన్‌లా ఫీల్ అయ్యాడు.. స్టంట్స్ చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు.. కట్ చేస్తే నవ్వాపుకోలేని సీన్..
ప్రపంచంలో ట్యాలెంట్ (Talent) ఉన్నవారికి కొదవ లేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రూపంలో ట్యాలెంట్ ఉంటుంది. అది అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. సోషల్ మీడియా వేదికగా కొందరు తమ ట్యాలెంట్ ను బాహ్య ప్రపంచానికి...
ప్రపంచంలో ట్యాలెంట్ (Talent) ఉన్నవారికి కొదవ లేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రూపంలో ట్యాలెంట్ ఉంటుంది. అది అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. సోషల్ మీడియా వేదికగా కొందరు తమ ట్యాలెంట్ ను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో నిత్యం వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టంట్స్ కు సంబంధించిన వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తాయి. సాధారణంగా స్టంట్స్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాలు కూడా జరుగుతాయి. స్టంట్స్ చేయడంలో ప్రొఫెషనల్స్ అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గాయాలపాలవడం మాత్రం పక్కా. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో(Video Viral) లో ఓ వ్యక్తి.. సైకిల్‌పై శక్తిమాన్‌గా స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతని స్టంట్ విఫలమైంది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి సైకిల్‌తో రోడ్డుపై విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు చూడవచ్చు. ఇంతలో అతను అకస్మాత్తుగా ఒక కారు ముందుకు వచ్చి విన్యాసాలు చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతను సైకిల్‌పై నియంత్రణ కోల్పోతాడు. అంతే కాకుండా అతని సైకిల్ చక్రం కారును ఢీకొనడంతో వ్యక్తి రోడ్డుపై పడిపోతాడు. అజాగ్రత్త కారణంగానే ఈ ఘటన జరిగిందనే విషయం వీడియో చూడగానే మనకు అర్థమవుతుంది.
ఈ వీడియోను 1000 వేస్ టు డై అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా 3,500 మంది లైక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.