Viral: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. కట్ చేస్తే.. ప్రియుడు అరెస్ట్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్!

|

Jul 19, 2022 | 7:02 PM

ఓ యువతికి సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు...

Viral: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. కట్ చేస్తే.. ప్రియుడు అరెస్ట్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్!
Phone Call
Follow us on

ఓ యువతికి సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. తాను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. కొద్దిరోజుల్లో బెంగళూరు వచ్చి పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు. సీన్ కట్ చేస్తే.. రెండు రోజుల తర్వాత యువతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల యువతిని సైబర్ నేరగాళ్లు ఘరానాగా బురిడీ కొట్టించారు. స్థానికంగా ఉన్న బసవనగుడికి చెందిన సదరు యువతికి నీల్ యష్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.. కొద్దిరోజుల్లో బెంగళూరు వచ్చి పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు. ఇక అతడు చెప్పిన మాటలను సదరు యువతి పూర్తిగా నమ్మేసింది.

సీన్ కట్ చేస్తే.. రెండు రోజుల అనంతరం యువతి మొబైల్ ఫోన్‌కు ఓ గుర్తు తెలియని మహిళ కాల్ చేసి.. ‘నీ ప్రియుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. విడుదల చేయాలంటే రూ. 2.20 లక్షల కస్టమ్స్ ఫీజు చెల్లించాలని’ పేర్కొంది. నిజమని నమ్మిన ఆ యువతి.. సదరు మహిళ చెప్పిన అకౌంట్‌కు రూ. 2.20 లక్షలు పంపించింది. ఇంకేముంది డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి జమ కాగానే.. ఆ మహిళ, నీల్ యష్ ఫోన్లు స్విచాఫ్ వచ్చాయి. ఎంతసేపటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. తాను మోసపోయానని గుర్తించిన యువతి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..