Viral Video: ఇందుకే కదా చిన్నపిల్లలు ముద్దొచ్చేది.. హృదయాన్ని హత్తుకుంటున్న చిన్నారి వీడియో..
Viral Video: చిన్న పిల్లల చేసే పనులు కొన్ని కొన్నిసార్లు చాలా ముద్దొస్తుంటుంది. వారి అల్లరి పనులు, అమాయకత్వం ముచ్చటేస్తుంటుంది.
Viral Video: చిన్న పిల్లల చేసే పనులు కొన్ని కొన్నిసార్లు చాలా ముద్దొస్తుంటుంది. వారి అల్లరి పనులు, అమాయకత్వం ముచ్చటేస్తుంటుంది. అందుకే సోషల్ మీడియాలో పసి పిల్లలు చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా హృదయానికి హత్తుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చిన్నారి.. నీటిలో ఉండే చేపలకే నీరు తాగిపిస్తోంది. అవును.. వారికేం తెలుసు ఆ చేపల గురించి.
ఈ వీడియోలో ఓ చిన్నారి తన తల్లి వెంట చేపలు ఉన్న కొలను వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న చేపలకు ఆహారం వేసిన చిన్నారి కాసేపు వాటితో సరదాగా ఆడుకుంది. అయితే, మనం ఆహారం తిన్న తరువాత మంచినీరు తాగుతాం కదా.. ఆ చేపలు కూడా అలాగే తాగుతాయని భావించినట్లుంది. ఓ గ్లాస్‌లో నీటిని తీసుకుని చేపలకు తాగించింది. అయితే, చిన్నారి ఆ చేపలకు నీరు తాపిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. ‘పిల్లలతో ప్రయానించడం బాగుంటుంది. వారి హృదయం స్వచ్ఛమైనది.’ అని క్యాప్షప్ పెట్టారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. 10 లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేస్థాయిలో లైక్స్ కూడా వచ్చాయి. ఈ బ్యూటీఫుల్ వీడియో చూసి.. చిన్నారి చర్యకు ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. పసిపిల్లల మనస్సు ఎంతో అందమైనది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..