Viral News: ఎయిర్‌పోర్ట్‌లో కదులుతూ కనిపించిన ప్యాసింజర్ బ్యాగ్.. అనుమానంతో చెక్ చేసిన అధికారులు షాక్..

|

Aug 14, 2022 | 5:34 PM

Viral News: అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా అక్రమ రవణాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు కన్నుగప్పి అక్రమ దందాను యథేశ్చగా సాగిస్తున్నారు. ఇప్పటి వరకు మనం అక్రమంగా...

Viral News: ఎయిర్‌పోర్ట్‌లో కదులుతూ కనిపించిన ప్యాసింజర్ బ్యాగ్.. అనుమానంతో చెక్ చేసిన అధికారులు షాక్..
Follow us on

Viral News: అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా అక్రమ రవణాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు కన్నుగప్పి అక్రమ దందాను యథేశ్చగా సాగిస్తున్నారు. ఇప్పటి వరకు మనం అక్రమంగా తరలించినా గంజాయికి సంబంధించిన సంఘటనలను చూసుంటాం. ఇక విమానాల్లో అయితే బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన వార్తలు నిత్యం వస్తూనే ఉంటాయి. విదేశాల నుంచి అక్రమంగా వస్తువులను తరలిస్తూ కొందరు కస్టమ్స్‌ అధికారులకు దొరికిపోతుంటారు.

అయితే తాజాగా చెన్నై ఎయిర్‌ పోర్టులో చెకింగ్‌ చేపట్టిన కస్టమ్స్‌ అధికారులు ఓ ప్రయాణికుడి బ్యాగులో ఉన్న వాటిని చూసి షాక్‌ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌ నుంచి ఇండియాకు వచ్చిన ఓ ప్రయాణికుడు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగాడు. ఆ సమయంలో బ్యాగు కదులుతున్నట్లు కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు బ్యాగ్ ఓపెన్‌ చేసి చూశారు. బ్యాగులో కోతి పిల్ల, పాములు, కొండ చిలువలు, తాబేలు చూడగానే అధికారులు అవక్కాయ్యారు.

ఇవి కూడా చదవండి

డి బ్రజ్జా జాతికి చెందిన కోతి పిల్ల, 15 కింగ్ స్నేక్స్, 5 కొండ చిలువల పిల్లలు, రెండు తాబేలు పిల్లలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ ప్రయాణికుడు అక్రమంగా భారత్‌లోకి తీసుకొస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. వాటిని థాయ్‌ ఎయిర్‌ వేస్‌ ద్వారా తిరిగి థాయ్‌లాండ్‌ పంపనున్నట్లు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..