Viral: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

|

Sep 12, 2024 | 9:00 AM

వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అంటుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారని పెద్దలు మాట. మరి అలాంటి వైద్యులే చేయకూడదని తప్పు చేస్తే..

Viral: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది
Doctors
Follow us on

వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అంటుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారని పెద్దలు మాట. మరి అలాంటి వైద్యులే చేయకూడదని తప్పు చేస్తే.. ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలో వెలుగు చూసింది. లాతూర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిజేరియన్‌కు ఉపయోగించిన ఓ గుడ్డముక్కను మహిళ కడుపులో పెట్టి మర్చిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

ఇవి కూడా చదవండి

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని లాతూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిజేరియన్ సమయంలో ఓ వాడిపడేసిన గుడ్డముక్కను మహిళ కడుపులో పెట్టి కుట్లు వేసేశారు. సదరు మహిళకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసిన నాలుగు నెలల తర్వాత కూడా కడుపునొప్పి తగ్గకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్ని మందులు వాడినా కడుపునొప్పి తగ్గకపోవడంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఇక అక్కడి డాక్టర్లు CT స్కాన్ చేసి చూడగా.. కడుపులో గుడ్డముక్క ఉన్నట్టు గుర్తించారు. సీ-సెక్షన్ సమయంలో రక్తాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే గుడ్డను మహిళ కడుపులో డాక్టర్లు వదిలేసినట్లు తేలింది. గంటన్నర పాటు ఆపరేషన్ చేసి.. ఆ గుడ్డను మహిళ కడుపులో నుంచి బయటకు తీశారు డాక్టర్లు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి