సోషల్ మీడియా ప్రపంచం ఆశ్చర్యాల నిలయం. ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు షాక్‌కు గురి చేస్తూ ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
నీటిలో మొసలి రారాజు. నీళ్లలో దానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటారు. ఎంతటి బలమైన జంతువైనా నీళ్లలో మొసలికి తలవంచాల్సిందే. దానికి ఆహారం కావాల్సిందే. అంతటి బలశాలికి ఏదైనా జంతువు దొరికితే.. ఇంకేమైనా ఉందా.! దాని పని అయిపోయినట్లే.!
వైరల్ వీడియో ప్రకారం.. ఓ కుక్క కర్రలతో నిర్మించిన వంతెనపై అటూ.. ఇటూ తిరుగుతూ ఉంది. నీటిలో ఏదో కదులుతుండగా.. అది చేప అనుకుని తొంగి చూస్తుంది. తీరా చూసేసరికి మొసలి. అమాంతం కుక్కపై ఎటాక్ చేస్తుంది. తన పదునైన దవడలతో దాని నోటిని పట్టుకుని నీళ్లలోకి లాగేస్తుంది. అయితే అక్కడే ఉన్న కొంతమంది జనాలు ఇదంతా చూసి వెంటనే కుక్కను నీటిలో నుంచి బయటికి తీశారు. ఈ వీడియోను ‘ది డార్క్ సైడ్ ఆఫ్ నేచర్’ అనే ట్విట్టర్ ఖాతా సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 66,700 వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
— The Dark Side Of Nature (@darksidenatures) July 30, 2021