బహిరంగ ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్ ఘటనలు తరచుగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తాయి. ఇంతకుముందు బాధితులు తరచుగా మౌనంగా ఉండేవారు. అయినప్పటికీ పోలీసులు కల్పిస్తున్న అవగాహనతో చాలా మంది బాధితులు ఇప్పుడు బలంగా బయటకు వస్తున్నారు. అలాంటి సంఘటనలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించినందుకు పాఠశాల విద్యార్థి తన చెప్పుతో కొట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ఘటన మహారాష్ట్రాలోని రత్నగిరి జిల్లాలో జరిగినట్లు తెలుస్తుంది. అక్కడ ఓ పాఠశాల విద్యార్థితో బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఓ మైదానంలో బస్సు కండక్టర్‌ను విద్యార్థి గట్టిగా చెప్పుతో కొట్టింది. దీంతో ఆ ఈ వీడిమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఆ అమ్మాయి ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. అమ్మాయిలు అంటే ఇలా ఉండాలని, ఈవ్ టీజింగ్ చేస్తే తాట తీయాలని పలువురు కామెంట్లు పెడుతున్నారు. బెస్ట్ ట్రీట్‌మెంట్ ఇచ్చారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
పోలీసులు ఈవ్ టీజింగ్‌పై మహిళలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఎలాంటి సంఘటనలు జరిగిన ధైర్యంగా ఉంటున్నారు. మహిళలు సమస్యలు వస్తే భయపడకుండా ముందుకెళ్తున్నారు. తమ కోసం ఎవరు రారని తమ కోసం తామే నిలబడుతున్నారు. వేధింపులు జరిగితే మౌనంగా ఉండకుండా గట్టిగా స్పందిస్తున్నారు.
This Girl taught the Conductor a Lesson who was misbehaving and teasing girl’s inside Bus, Ratnagiri MH
pic.twitter.com/SwnSf38try— Ghar Ke Kalesh (@gharkekalesh) October 10, 2024