Viral: తక్కువ ధరకే విమానం టికెట్లు, ఐఫోన్లు.. తీరా అసలు విషయం తెలిసి దెబ్బకు ఫ్యూజులౌట్!

|

Aug 09, 2022 | 6:14 PM

వాళ్ళిద్దరూ దంపతులు. ఓ ఏవియేషన్ అకాడమీ నడుపుతున్నారు. తక్కువ ధరకే విమానం టికెట్లు, ఐఫోన్లు ఇస్తామంటూ ప్రచారం చేశారు.

Viral: తక్కువ ధరకే విమానం టికెట్లు, ఐఫోన్లు.. తీరా అసలు విషయం తెలిసి దెబ్బకు ఫ్యూజులౌట్!
Viral '
Follow us on

వాళ్ళిద్దరూ దంపతులు. ఓ ఏవియేషన్ అకాడమీ నడుపుతున్నారు. తక్కువ ధరకే విమానం టికెట్లు, ఐఫోన్లు ఇస్తామంటూ ప్రచారం చేశారు. అంతే! ఇంకేముంది పెద్ద ఎత్తున జనం క్యూ కట్టారు. తీరా అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నారు. చివరికి ఆ కిలాడీ కపుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బెల్గాంలో నివాసముంటున్న సుదర్శన సుజాతలు.. స్థానికంగా డ్రీమ్‌ఫ్లై ఏవియేషన్ అకాడమీ ఒకటి కొన్నేళ్ళుగా నడుపుతున్నారు. తక్కువ ధరకే విమాన టికెట్లు ఇవ్వడమే కాకుండా పలు హోటళ్ళలో రాయితీతో వసతి కల్పిస్తూ డబ్బులు తీసుకునేవారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన చాణక్య, ఉత్తమ్ అనే ఇద్దరు వ్యక్తులు తమ కస్టమర్లకు తక్కువ సగం ధరకే విమానం టికెట్లు, హోటళ్ళలో వసతి కల్పించాలంటూ ఈ దంపతులను కోరారు. వారికి టికెట్‌పై 50 శాతం రాయితీ ఇస్తానంటూ సుదర్శన్ మాటిచ్చాడు. దీంతో పదుల సంఖ్యలో జనాలు టికెట్లు కొన్నారు. రాయితీలు వచ్చాయి.

అలాగే రూ. 80 వేలు విలువ చేసే ఒకట్రెండు ఐఫోన్లు రూ. 45 వేలకు ఇచ్చారు. దీంతో తమకు కూడా తక్కువ ధరకే కావాలంటూ జనాల పెద్ద ఎత్తున డబ్బును సుదర్శన్, సుజాతలకు ఇచ్చారు. ఇక ఇదే సరైన సమయం అనుకుని సుదర్శన్ తన ప్లాన్ ఆచరణలో పెట్టాడు.. డిపాజిట్‌గా రూ. 20 లక్షలు ఉంచాలని చాణక్య, ఉత్తమ్‌లకు చెప్పాడు. వారు ఆ మొత్తాన్ని డిపాజిట్ కూడా చేశారు. ఇక ఆ తర్వాత బుక్ చేసుకున్న విమాన టికెట్లకు రాయితీ రాలేదు. జనాలకు ఐఫోన్లు కూడా అందలేదు. ఎందుకివ్వలేదని చాణక్య, ఉత్తమ్ ప్రశ్నించగా.. సుదర్శన్ మాట దాటవేస్తూ వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశాడు. అలాగే బెల్గాం నుంచి ఈ దంపతులు మకాం మార్చేయడంతో బాధిత జనం, ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. ఇక ఖాకీలు ఈ మేరకు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..