Viral Video: ఛీ.. ఛీ.. మీ కక్కుర్తి తగలయ్యా! ఇవి కూడా దొబ్బుకెళ్తారా.? చూస్తే షాకే..

ఈ మధ్యకాలంలో కొంతమంది వింత దొంగలు కాదేదీ దొంగతనానికి కనర్హం అని అంటున్నారు. మరీ ఇలాంటివి కూడా దొంగాలిస్తారా..?

Viral Video: ఛీ.. ఛీ.. మీ కక్కుర్తి తగలయ్యా! ఇవి కూడా దొబ్బుకెళ్తారా.? చూస్తే షాకే..
Viral Video

Updated on: Sep 21, 2022 | 1:37 PM

ఈ మధ్యకాలంలో కొంతమంది వింత దొంగలు కాదేదీ దొంగతనానికి కనర్హం అని అంటున్నారు. మరీ ఇలాంటివి కూడా దొంగాలిస్తారా..? అనేలా షాక్‌కు గురి చేసేలా చేస్తున్నాయి. ఇటీవల అలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఆ కోవకు చెందినదే ఇది కూడా. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బసవనగుడి స్టూడియో రోడ్డులో అర్ధరాత్రి సమయంలో ఓ ప్రాంతంలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ జంట బయటికి దిగింది. యువతి ఏమో కారు అద్దాన్ని తుడుస్తున్నట్లు నటిస్తుంటే.. యువకుడు ఏమో ఎవరూ చూడట్లేదని గమనించి.. ఆ పక్కన ఉన్న కుండీలను.. ఒకదాని తర్వాత ఒకటి కారు డిక్కీలోకి పెట్టడం మొదలుపెట్టాడు. అన్నింటినీ కొట్టేసిన తర్వాత ఇద్దరూ కూడా ఏమీ ఎరుగనట్లు అక్కడ నుంచి తుర్రుమని పరారయ్యారు. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో ఇదంతా రికార్డు కావడంతో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన విజువల్స్ వైరల్‌గా మారాయి. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.