
యాడ దొరికిన సంతరా సామి. రోజుకో కొత్త రకం స్కామ్‌తో జనాలకు కత్తెర వేస్తున్నారు కేటుగాళ్లు. ఎంత అలెర్ట్‌గా ఉన్నా.. ఏదో ఒక లూప్‌తో ఇస్మార్ట్‌గా దోచేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కొత్త స్కామ్ కరెన్సీ కౌంటింగ్‌కి సంబంధించినది. స్కామ్ ఏంటంటే… 500 రూపాయల నోట్ల కట్టను నీట్‌గా మనకు ఇస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ ఆ కట్టలో కొంతమేర నోట్లను మడిచిపెట్టి.. లోపల గ్యాప్ ఉంచేస్తారు. కౌంటింగ్ మెషీన్‌లో వేసినా లేదా చేత్తో లెక్కించినా… గమనించని వ్యక్తికి మొత్తం నోట్లే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజానికి లోపల కొన్ని నోట్లు మడిచిపెట్టి తగ్గించారు. ఇలా లెక్క తప్పేలా చేసి, లక్షల్లోనూ, వేలల్లోనూ సైలెంట్‌గా డబ్బు మాయ చేస్తున్నారు.
ఈ కొత్త కౌంటింగ్ కట్టర్ టెక్నిక్‌కు ఇప్పటికే చాలామంది బలయ్యారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, కరెన్సీ లావాదేవీల్లో జాగ్రత్తగా పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు. పెద్ద మొత్తంలో కరెన్సీ తీసుకునే, ఇచ్చే సమయంలో అలెర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు.
వీడియో దిగువన చూడండి…
New scam, please be aware. pic.twitter.com/n22UR8uGcO
— 𝗟 𝗼 𝗹 𝗹 𝘂 𝗯 𝗲 𝗲 (@Lollubee) August 14, 2025